అగ్ర నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా ఇరవై ఏళ్ళ ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న దిల్ రాజు ఇప్పటికీ అదే జోరుని కొనసాగించడం అప్ కమింగ్ ప్రొడ్యూసర్లకు ఎంతో స్ఫూర్తినిచ్చేదే. కొన్ని సక్సెస్ సీక్రెట్స్ కొన్ని అర్థం కాని విషయాలు ఆయనగా చెబితే వినాలని అభిమానులు ఎదురు చూడటం సహజం. ఈ సందర్భంగా మా వెబ్ సైట్ కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్లాప్ దర్శకుల గురించి ఓపెనయ్యారు. మాములుగా ఏదైనా ఒక ప్రొడక్షన్ హౌస్ తమకు డిజాస్టర్ ఇచ్చిన దర్శకులను దూరం పెట్టేస్తారు. నష్టం వచ్చిందనే భావన తప్ప మరొకటి కాదు
కానీ దిల్ రాజు దానికి భిన్నం. వంశీ పైడిపల్లిని మున్నాతో లాంచ్ చేసినప్పుడు ప్రభాస్ ని సరిగా హ్యాండిల్ చేయలేక పరాజయం చవి చూడాల్సి వచ్చింది. లాసూ తప్పలేదు. అయినా సరే మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోతోనే బృందావనం అవకాశం ఇచ్చారు. కట్ చేస్తే ఆ బ్లాక్ బస్టరే మొన్నటి వారసుడు దాకా ప్రయాణం చేయించింది. ఓ మై ఫ్రెండ్ వచ్చిన టైంలో యూత్ లో మంచి అంచనాలు ఉండేవి. కానీ డైరెక్టర్ వేణు శ్రీరామ్ పూర్తిగా మెప్పించలేకపోయాడు. తిరిగి ఎంసిఏ మిడిల్ క్లాస్ అబ్బాయి ఇచ్చిన రాజుగారికి నాని కెరీర్లో మొదటి హయ్యెస్ట్ గ్రాసర్ దక్కింది.
తిరిగి ఈ కాంబినేషన్ తో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ వరకు జర్నీ సాగింది సాగుతోంది. ఈ విషయాన్నే ప్రస్తావిస్తే తనకు వాళ్ళు చెప్పిన కథ నచ్చినప్పుడు ఖచ్చితంగా టాలెంట్ ఉండటం వల్లే కనక, కేవలం ఒక పరాజయం వల్ల దూరం చేయడం కాకుండా హిట్ ఇచ్చి పంపాలన్నదే తన లక్ష్యమని అసలు రహస్యం బయట పెట్టారు. దీంతో పాటు నెపోటిజం, గేమ్ చేంజర్, ఆ నలుగురు ఇండస్ట్రీ వివాదం, వెబ్ సిరీస్ ల గురించి అభిప్రాయం, తన పిల్లల ఫ్యూచర్ ప్లాన్స్ ఇవన్నీ కూలంకుషంగా వివరించారు దిల్ రాజు. సినిమాలే కాదు వారి సృష్టికర్తగా ఆయన అనుభవం వందల పుస్తకాలతో సమానమే.