చిరంజీవి హీరోగా అశ్వనీదత్ నిర్మాణంలో గుణ శేఖర్ తీసిన చూడాలని వుంది అప్పట్లో మంచి విజయం అందుకుంది. ఈ సినిమాతో చిరు సాలిడ్ హిట్ కాకపోయినా కొంత వరకూ మెప్పించి సుపర్ హిట్ కొట్టారు. అయితే సినిమాలో కలకత్తా నేపథ్యం , లవ్ ట్రాక్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించాయి. ముఖ్యంగా చిరు రైల్వే స్టేషన్ లో అంజలా ఝవెరీ కి లైన్ వేసే సీన్ ఐకాన్ అనిపిస్తుంది. ఈ సన్నివేశం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు గుణశేఖర్ కొన్ని విషయాలు చెప్పుకున్నారు.
“చిరంజీవి గారికి డైలాగులు లేకుండా కేవలం హీరోయిన్ ను చూస్తూ ఉండే లవ్ సీన్ అది. అంతకు ముందే పవన్ కళ్యాణ్ గారు తొలి ప్రేమ తో ఒక ఊపు ఊపేశారు. దీంతో అందరూ పవన్ కళ్యాణ్ తో చేయాల్సిన సీన్ చిరంజీవి గారితో చేస్తున్నాడేంటి ? అనుకునే వాళ్ళు. అంత యూత్ ఫుల్ సీన్ అది. అందుకే ఆ సీన్ కోసం చాలా కష్టపడ్డాను.
ముందే సీన్ టు ప్రతీ కదలిక డీటైల్ గా స్క్రీన్ ప్లే రాసుకొని కంప్లీట్ గా తీయడం జరిగింది. ఎలాంటి డైలాగులు లేకుండా పది నిమిషాల పాటు ఆ సీన్ తీయడం నాకు పెద్ద ఛాలెంజ్. 18 పేజీలతో సీన్ పేపర్ ఆ? గుణ శేఖర్ రిస్క్ చేస్తున్నాడా ? అని ఏ మాత్రం అనుకోలేదు చిరంజీవి గారు. అంతలా నన్ను నమ్మేశారు. మొత్తం చదివి అబ్బా అని చెప్తూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇక ఒరిజినల్ లొకేషన్ లోనే తీద్దామని డిసైడ్ అయ్యాను.
ఈ సీన్స్ కోసం రెండు లొకేషన్స్ కావాలి ఒకటి నాంపల్లి రైల్వే స్టేషన్ ఇంకొకటి కాచిగూడ స్టేషన్. అలా అడిగేసరికి నిర్మాత దత్తు గారు షాక్ అయ్యారు. కావాలంటే కలకత్తా సెట్ వేసినట్టే ఒక రైల్వే స్టేషన్ సెట్ వేద్దాం కానీ చిరంజీవి గారిని పెట్టుకొని అక్కడ ఘాట్ చేయడం ఇంపాజిబుల్ అన్నారు. పైగా పర్మిషన్ కష్టమని చెప్పారు. నేను మాత్రం నేచురల్ లొకేషన్స్ కావాలని చెప్పాను. ఇక నాంపల్లిలో ఎక్కడెక్కడో జనాలు వస్తారు. అప్పటికి చిరంజీవి గారికి ఎనలేని క్రేజ్ వుంది. దీంతో నిర్మాత అశ్వనీదత్ గారు కూడా చేత కర్ర పట్టి జనాలను కంట్రోల్ చేయాల్సి వచ్చింది. ఒకరోజు నాంపల్లి , ఇంకో రోజు కాచిగూడ స్టేషన్స్ లో చేశాము. కానీ దత్తు గారు ఆ లొకేషన్స్ లో తీయడానికి ఒప్పుకోవడం, నన్ను చిరంజీవి గారు నమ్మడం వల్లే ఆ సీన్ గొప్పగా వచ్చింది. జనాలని కంట్రోల్ చేయలేకపోయాం. ఆ రోజు షూటింగ్ కారణంగా చాలా మండి ట్రైన్ మిస్ అయ్యారు. ” అంటూ ట్రైన్ సీన్ గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు గుణశేఖర్. ఇప్పటికీ చిరు ట్రైన్ సీన్ ఫ్రెష్ గా అనిపిస్తుంది. దాని వెనుక టెక్నీషియన్స్ కష్టం ఎంతో ఉంది.
This post was last modified on April 3, 2023 9:38 pm
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…