Movie News

తారక్ అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు

రీ రిలీజుల ట్రెండ్ క్రమంగా వట్టిపోతోంది. పది సినిమాల్లో రెండు ఆడుతుంటే మిగిలినవి కనీసం అద్దె ఖర్చులు కూడా కిట్టుబాటు చేయడం లేదు. పోకిరి, జల్సా, చెన్నకేశవరెడ్డి, ఖుషి, ఆరంజ్ లు తప్ప కమర్షియల్ గా వర్కౌట్ అయినవి వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు. స్టార్ హీరోల ఫ్యాన్స్ ని ఎమోషనల్ గా టార్గెట్ చేయడం వల్ల వసూళ్లు రాబట్టుకోవాలని చూస్తున్న డిస్ట్రిబ్యూటర్ల అత్యాశ సోషల్ మీడియాలో అర్థం లేని చర్చకు దారి తీస్తోంది.

నిన్న ఆంధ్రావాలా కొన్ని థియేటర్లలో స్క్రీనింగ్ చేశారు. ఒకటి రెండు చోట్ల తప్ప ఇంకెక్కడా కనీస స్థాయిలో జనం లేరు. నిజానికి అభిమానులే ఇది విడుదల చేయొద్దని డిస్ట్రిబ్యూటర్ కు ఫోన్ చేసి మరీ వేడుకున్నారు. స్టూడెంట్ నెంబర్ వన్ లాంటి హిట్లు అయితే ఎంజాయ్ చేస్తామని ఇలా డిజాస్టర్లు తేవడం వల్ల యాంటీ ఫ్యాన్స్ కి టార్గెట్ అవుతామని వాపోయారు. కానీ బయ్యర్ వినలేదు.

మొండిగా ముందుకెళ్లాడు. త్వరలో సింహాద్రిని తారక్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేయబోతున్నామని వచ్చిన ప్రకటన అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. రాజమౌళి జూనియర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ ని మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూడొచ్చని సంబరపడ్డారు. మే 20న ఆది కూడా వస్తుందని నిన్న సాయంత్రం హఠాత్తుగా ప్రకటన రావడం మూవీ లవర్స్ ని షాక్ కి గురి చేసింది.

ఇదీ వెండితెర మీద అనుభూతి చెందాల్సిన మాస్ బొమ్మనే. అయితే సింహాద్రి, ఆదిలను ఒకేసారి విడుదల చేయడం వల్ల తమను ఇబ్బందులకు గురి చేయడం తప్ప ఇంకేం ఉండదని ఫీలవుతున్నారు. బర్త్ డే అన్నప్పుడు ఏదో ఒకటే చేయాలి. ముందు సింహాద్రి అనౌన్స్ మెంట్ ఇచ్చారు కాబట్టి దానికి కట్టుబడితే బాగుండేది కానీ ఇలా సడన్ గా మరొకటి తేవడం వల్ల ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ లో విడిపోయి ఒకటే చూస్తారు. దీనివల్ల రికార్డులు మిస్ అవుతాయి. వాళ్ళ బాధ సబబే.

Share

Recent Posts

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

1 hour ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

2 hours ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

2 hours ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

3 hours ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

3 hours ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

4 hours ago