తెలుగు సినిమాలు తీయడం ఎప్పుడో ఆపేసిన అగ్ర నిర్మాత ఏఎం రత్నం ఏ ముహూర్తంలో హరిహర వీరమల్లు మొదలుపెట్టారో కానీ అప్పటి నుంచి దీనికి పడుతున్న బ్రేకులు అన్నీ ఇన్ని కావు. కరోనా, లాక్ డౌన్, సెట్లు ప్రమాదానికి గురి కావడం, జనసేన వల్ల పవన్ వరసగా డేట్లు ఇవ్వలేకపోవడం ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే కర్ణుడి చావుకు వెయ్యి కారణాలన్నట్టుగా ఫైనల్ గా ఎప్పుడు ముగుస్తుందో అంతు చిక్కడం లేదు.
ఆ మధ్య బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ వచ్చాక వేగం పెరుగుతుందేమో అనుకుంటే కీలకమైన ఎపిసోడ్లు షూట్ చేశాక మళ్ళీ ఆపారు. డెబ్భై శాతం పైగా పూర్తయ్యిందని ఇన్ సైడ్ టాక్ ఉంది కానీ దర్శకుడు క్రిష్ మాత్రమే దీనికి సంబంధించిన క్లారిటీ ఇవ్వగలరు. ఇక విడుదల తేదీకి సంబంధించిన సందిగ్దత మెల్లగా దారులు మూసుకునేలా వేస్తోంది. వేసవికి పవన్ సాయి ధరమ్ తేజ్ ల డేట్ ఇచ్చేశారు.
సో సమ్మర్ మిస్ అయినట్టే. ఇండిపెండెన్స్ డేని లక్ష్యంగా పెట్టుకుని ఆగస్ట్ 11 భోళా శంకర్ ని లాక్ చేశారు. పోనీ దసరా అనుకుందామా అంటే రామ్ బోయపాటి, టైగర్ నాగేశ్వరరావు, లియోలు కర్చీఫ్ వేసుకున్నాయి. వీరమల్లు లాంటి ప్యాన్ ఇండియాకి దీపావళి, డిసెంబర్ లు పెద్ద స్థాయిలో వర్కౌట్ కావు. నెక్స్ట్ ఉన్న ఆప్షన్ సంక్రాంతి ఒకటే. ఆల్రెడీ ప్రాజెక్ట్ కె, మహేష్ బాబు 28 రిజర్వ్ చేసుకున్నాయి.
ఇండియన్ 2 లేదా గేమ్ చేంజర్ వీటిలో ఒకటి పక్కా తోడవుతుంది. మరి వీరమల్లు రావాలంటే వీటిలో ఒకటి తప్పుకోవాలి. అదంత సులభం కాదు. ఒకవేళ అదీ వదిలేస్తే 2024 సమ్మర్ దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అసలు విడుదల విషయంలో టీమ్ ప్లానింగ్ ఏంటో అంతు చిక్కడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులైతే జరుగుతున్నాయి కానీ ఫలానా టైం అని టార్గెట్ పెట్టుకోకపోవడం వల్ల సమస్య వస్తోంది. పవన్ మొదటి ప్యాన్ ఇండియా మూవీకి ఇన్ని ట్విస్టులైతే ఎవరూ ఊహించలేదు.
This post was last modified on March 29, 2023 10:20 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…