శ్రుతి హాసన్‌ను తండ్రికి తగ్గ తనయురాలు అనలేం కానీ.. కమల్ హాసన్ తనను ఎందుకు సినిమాల్లోకి తెచ్చానని ఫీలయ్యేలా మాత్రం చేయలేదు. నటిగా, సింగర్‌గా, మ్యుజీషియన్‌గా సత్తా చాటుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది శ్రుతి.
కథానాయికగా పాతిక సినిమాల దాకా చేసిన శ్రుతి.. తండ్రి సినిమా ‘ఈనాడు’కు సంగీతం అందించడమే కాక.. కొన్ని సినిమాల్లో పాటలు పాడింది. ఇప్పుడు ఆమె కొత్త ప్రతిభను బయట పెట్టుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆమె రచయిత అవతారం ఎత్తబోతోంది. కథ చెప్పే కళను నేను ఎప్పుడూ ఆరాధిస్తా.
ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే స్క్రిప్టు అందించడం నా కల. సినీ పరిశ్రమలో నా కొత్త ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుయ చూస్తున్నా. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది’’ అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్రుతి తెలిపింది. ఆమె మాటల్ని బట్టి చూస్తే శ్రుతి స్క్రిప్ట్ రైటర్‌గా మారినట్లు కనిపిస్తోంది. మరి రచయితగా ఆమె తొలి ప్రయత్నం ఎలా ఉంటుందో చూడాలి.
కమల్ ఎన్నో కథలు రాయడమే కాక సొంతంగా డైరెక్ట్ చేశాడు కూాడా. తండ్రి బాటలో ఆమె కూడా తన టాలెంట్ చూపిస్తుందని ఆశించవచ్చు. ఇక నటిగా శ్రుతి కెరీర్ విషయానికి వస్తే.. మధ్యలో కొన్నేళ్లు సినిమాల నుంచి విరామం తీసుకున్న ఆమె.. ‘క్రాక్’తో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సంక్రాంతికి ఆమె నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ విడుదలై మంచి ఫలితాన్ని అందుకున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates