రవితేజతో ‘జై భీమ్’… చేయాలనుంది

నాని ‘వాల్ పోస్టర్ సినిమా’ అనే సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేసి కసెప్ట్ సినిమాలు , థ్రిల్లర్ మూవీస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మాస్ మహారాజా , నేచురల్ స్టార్ నాని తాజాగా ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూ కోసం కలిశారు. అందులో నాని తను నిర్మాతగా రవితేజతో చేస్తే ఎలాంటి సినిమా చేస్తాననే విషయాన్ని చెప్పుకున్నాడు.

రవితేజ హీరోగా జై భీమ్ లాంటి సినిమా చేయాలనుందని అన్నాడు. సూర్య హీరోగా వచ్చిన జై భీమ్ ఆడియన్స్ లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసి నేషనల్ అవార్డు అందుకుంది. సో రవితేజ అలాంటి సినిమా చేస్తే కొత్తగా ఉంటుందని నాని భావిస్తున్నాడు కాబోలు. ఇక ఈ ఇద్దరు కలిసి చేసే మల్టీ స్టారర్ గురించి కూడా అందులో డిస్కస్ చేసుకున్నారు.

తామిద్దరం కలిసి చేసే సినిమాకు కష్టమైన , నష్టమైన తమదే ఉండాలని ఓ మాట అనుకున్నారు. ఒక వేళ ఈ కాంబోలో సినిమా చేస్తే ఆర్ టీ టీం వర్క్స్ , వాల్ పోస్టర్ సినిమా బేనర్స్ లోనే చేస్తామని చెప్పారు. దసరా, రావణాసుర రెండు సినిమాల గురించి రవితేజ , నాని చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఆడియన్స్ కి మంచి కిక్ ఇస్తుంది. చివర్లో ఇద్దరు తమ సినిమాల సక్సెస్ ఊహించి ఒకరికోకరు కంగ్రాట్స్ చెప్పేసుకున్నారు.