వచ్చే నెల 28న విడుదల కాబోతున్న ఏజెంట్ కోసం అభిమానుల ఎదురుచూపులు అన్ని ఇన్ని కావు. ఆ డేట్ కి ఖచ్చితంగా వస్తుందనే నమ్మకమైతే ఫ్యాన్స్ లో ఉంది కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలు, ప్రచారాలు చూస్తుంటే మేకి వాయిదా పడొచ్చన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఇదంతా ఎలా ఉన్నా నిర్మాత అనిల్ సుంకర ఇదేమీ పట్టించుకోకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లానింగ్ తో పాటు ట్రైలర్ లాంచ్ కి సంబంధించిన పనులను దర్శకుడు సురేందర్ రెడ్డితో పాటు ప్రత్యేక శ్రద్ధతో దగ్గరుండి చూసుకుంటున్నట్టు ఇన్ సైడ్ టాక్. అయితే ఇక్కడే ఒక ట్విస్టు ఉంది.
గెస్టుల బరువును మాత్రం అఖిల్ భుజాల మీదే పెట్టినట్టు వినికిడి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను తీసుకొస్తే ప్యాన్ ఇండియా లెవెల్ లో ఏజెంట్ కి బజ్ బాగా పెరుగుతుందని తాను అడిగితే పని జరగక్కపోవచ్చు కానీ అఖిల్ కి వాళ్ళతో ఎంతో చనువు ఉంది కాబట్టి ఎలాగైనా ఒప్పించమని అడుగుతున్నారట. తారక్ చరణ్ లు కలిసి ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన ఈవెంట్లలో తప్ప బయట ఎక్కడా కనిపించలేదు. విడివిడిగా ఇతర హీరోల వేడుకలకు హాజరయ్యారు తప్పించి జాయింట్ గా సాధ్యపడలేదు. అఖిల్ తలుచుకుంటే అవుతుందనేది అనిల్ తో పాటు సూరి ఆలోచన.
ఎలాగూ భోళాశంకర్ నిర్మాత తనే కాబట్టి చిరంజీవి ద్వారా అనిల్ సుంకర రాయబారం పెట్టొచ్చు. పైగా సురేందర్ రెడ్డికి అంతకన్నా ఎక్కువ బాండింగ్ మెగా ఫ్యామిలీతో ఉంది. ఇక్కడేం ఇబ్బంది లేదు. ఎటొచ్చి జూనియర్ ని ఒప్పించడం కష్టం. ఈ నెల 23 నుంచి తను కొరటాల శివతో రెగ్యులర్ షూటింగ్ లో బిజీ అయిపోతాడు. ఈ షెడ్యూల్ ఏకధాటిగా శంషాబాద్ పరిసరాల్లో పాతిక రోజులు జరుగుతుందట. అదే జరిగితే అంత సులభంగా అందుబాటులోకి రాడు. మరి అఖిల్ నడుం బిగించి వాళ్ళతో ఎస్ అనిపిస్తాడా లేక వేరే స్టార్లతో సర్దుకుంటాడా వేచి చూడాలి.
This post was last modified on March 20, 2023 4:57 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…