పక్కా కమర్షియల్ మీటర్లో సినిమాలు చేసే రాజమౌళి తన చిత్రాల కారణంగా వివాదాలు ఎదుర్కొన్న సందర్భాలు చాలా తక్కువ. ఐతే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్‌కు ముందు ఇందులో జూనియర్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి రిలీజ్ చేసిన టీజర్ ఒకటి వివాదాస్పదం అయింది. తారక్ చేసింది కొమరం భీమ్ పాత్ర కాగా.. ఈ పాత్ర ముస్లిం టోపీ పెట్టుకున్నట్లు చూపించడం మీద అప్పట్లో కాస్త దుమారం రేగింది.
తెలంగాణ బీజేపీ అధ్యకుడు బండి సంజయ్.. ఈ చిత్రం హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉందని, ఈ సినిమాను రిలీజ్ కానివ్వబోమని హెచ్చరికలు జారీ చేశారు అప్పట్లో. ఇదిలా ఉంటే.. మరోవైపేమో రాజమౌళి హిందూ ప్రో సినిమాలు తీస్తున్నాడంటూ మరో వర్గం ఆయన మీద ఒక ముద్ర వేసే ప్రయత్నం చేసింది. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం వల్లే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ను పద్మశ్రీ వరించిందనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ రెండు భిన్న వాదనలపై ఇంతకుముందే ఒకసారి స్పందించిన జక్కన్న.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ టాపిక్ మీద మాట్లాడాడు.
“ఏదైనా సినిమా మీద విమర్శలు రాకపోతే ఆ చిత్రంపై ప్రేక్షకులకు ఆసక్తి లేదని భావిస్తా. 12 సినిమాలు తీశాక నాకీ విషయం అర్థమైంది. ఒక చిత్రానికి ప్రచారం రావడం మొదలైన దగ్గర్నుంచి ఏదో ఒక కారణంతో దాన్ని విమర్శించే వాళ్లు ఉంటారు. ‘ఆర్ఆర్ఆర్’లో హీరో స్కల్ క్యాప్ ధరించి ముస్లింలా కనిపిస్తాడు కొంతసేపు. అది చూసి రైట్ వింగ్ పొలిటీషియన్ ఒకరు.. ఆ సీన్ తొలగించకపోతే థియేటర్లను తగలబెడతామని, నన్ను బహిరంగంగా కొడతానని హెచ్చరించారు. ఇంకోవైపేమో నేను హిందూ జాతీయ వాదాన్ని ప్రచారం చేస్తున్నానని లెఫ్ట్ వింగ్ వాళ్లు నాపై నిందలు వేశారు. నిజానికి నేను ఏ వర్గానికీ చెందను. నాకు ఏ వర్గం వారైనా, వాళ్లు దేనిపై పోరాడుతున్నా సరే.. అతి వాదం చేస్తే నచ్చరు. ఒక నిర్దిష్ట పాత్ర స్కల్ క్యాప్ ఎందుకు ధరించిందో చూసే ఓపిక వాళ్లకు లేదు. ఇంకొందరు నేను హిందూ జాతీయ వాదాన్ని ప్రచారం చేస్తున్నట్లు చూపించడానికి సాకులు వెతుకుతుంటారు. వాళ్లు తీవ్ర భావజాలం ఉన్న జాతీయ వాదులు. నకిలీ ఉదారవాదులు” అని రాజమౌళి ఇరు వర్గాలకూ కౌంటర్ ఇచ్చాడు.
This post was last modified on March 15, 2023 5:55 pm
ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…
దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…
రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహారాజ త్వరలో హాలీవుడ్ రీమేక్ కాబోతోందన్న వార్త…
సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయమవుతున్న ఎల్లమ్మను నెలల తరబడి వేధించిన సమస్య హీరోయిన్ ఎంపిక. మృణాల్ ఠాకూర్,…
టాలీవుడ్లో ఈ మధ్య రిలీజ్ డేట్ పంచాయితీలు బాాగా పెరిగిపోతున్నాయి. సెప్టెంబరు 24న రావాల్సిన నాని సినిమా ‘ది ప్యారడైజ్’ను…
ప్యాన్ ఇండియా సినిమాలకున్న అతి పెద్ద సమస్య రిలీజ్ డేట్ వేసుకోవడం. ఒకవేళ మంచి తేదీ దొరికినా దానికి కట్టుబడి…