Movie News

సినిమా డిజాస్టర్.. అదే నా బెస్ట్ అన్న డైరెక్టర్

యాక్షన్ హీరో గోపీచంద్ కెరీర్లో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా ‘గౌతమ్ నంద’. మూడేళ్ల కిందట వచ్చిన ఈ చిత్రం దాదాపు 30 కోట్ల బడ్జెట్లో తెరకెక్కింది. సంపత్ నంది డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి విడుదలకు ముందు మంచి హైపే వచ్చింది కానీ.. సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. కంటెంట్ పరంగా తీసి పడేయదగ్గ సినిమా కాదు కానీ.. పెట్టుబడి-రాబడి కోణంలో చూ చివరికి దీన్ని డిజాస్టర్‌గా తేల్చారు ట్రేడ్ పండిట్లు.

ఈ చిత్రం విడుదలై మంగళవారానికి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో దర్శకుడు సంపత్ నంది ఒక ఎమోషనల్ ట్వీట్ వేశాడు. ఒక ఫిలిం మేకర్‌గా ఇదే తన బెస్ట్ మూవీ అని అతను తీర్మానించాడు.

కొందరు ఈ చిత్రాన్ని కొందరు మోస్ట్ అండర్ రేటెడ్ అన్నారని.. కొందరు కరెక్ట్ రేటెడ్ అన్నారని.. కొందరు టెక్నికల్‌గా సుపీరియర్ అన్నారని.. కొందరు రైటింగ్ చాలా పూర్ అన్నారని.. ఐతే తాను ప్రతి అభిప్రాయాన్నీ గౌరవిస్తానని.. తన దృష్టిలో మాత్రం ఇది ఫిలిం మేకర్‌గా తన బెస్ట్ మూవీ అని.. ఆ విషయంలో తన నమ్మకం ఎప్పుడూ మారలేదని అన్నాడు సంపత్.

సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. సంపత్ అభిప్రాయంతో చాలామంది ఏకీభవిస్తారు. గోపీని రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో చాలా బాగా ప్రెజెంట్ చేశాడు సంపత్. ముఖ్యంగా ఇందులోని నెగెటివ్ క్యారెక్టర్ సినిమాకు హైలైల్. మూవీ కాన్సెప్ట్ కూడా ఆకట్టుకునేదే. కాకపోతే ఎగ్జిక్యూషన్ తేడా కొట్టింది.

సంపత్ కెరీర్లో ‘రచ్చ’ రూపంలో పెద్ద హిట్ ఉంది కానీ.. అది రొటీన్ ఫార్ములాటిక్ మసాలా మూవీ. సినిమా బాగా ఆడి ఉండొచ్చు కానీ.. దర్శకత్వ పరంగా దాంతో పోలిస్తే సంపత్‌కు ‘గౌతమ్ నంద’కే ఎక్కువ మార్కులు పడతాయి. ఆ సినిమా ఫెయిలైనప్పటికీ సంపత్, గోపీ కలిసి ‘సీటీమార్’తో మళ్లీ జత కట్టిన సంగతి తెలిసిందే.

This post was last modified on July 29, 2020 6:50 pm

Share

Recent Posts

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

25 minutes ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

35 minutes ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

3 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

4 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

4 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

4 hours ago