ఒకప్పుడు సౌత్ ఇండియన్ సినిమాలో ఒక వెలుగు వెలిగిన కథానాయిక ఇలియానా. ముఖ్యంగా టాలీవుడ్లో ఆమె హవా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘దేవదాసు’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో కథానాయికగా పరిచయం అయిన.. రెండో చిత్రానికే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌తో జట్టు కట్టి ఇండస్ట్రీ హిట్‌లో భాగం అయిన ఆమె.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. తర్వాత ఈ గోవా బ్యూటీ తమిళంలో కూడా కొందరు టాప్ స్టార్లతో నటించింది.
కానీ సౌత్‌లో కొంచెం జోరు తగ్గుతున్న టైంలో బాలీవుడ్‌కు వెళ్లిపోయి అక్కడే స్థిరపడిపోయిందామె. చాలా ఏళ్ల తర్వాత తిరిగి టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చినా ఆమెకు కలిసి రాలేదు. అదే సమయంలో బాలీవుడ్లో కూడా ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. అప్పుడప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లతో తప్ప ఆమె వార్తల్లో నిలవట్లేదు. ఇలాంటి టైంలో ఇలియానాను ఒక ఫిలిం ఇండస్ట్రీలో బ్యాన్ చేశారన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
తమిళ సినిమాల్లో ఇలియానా నటించకుండా అక్కడి నిర్మాతల మండలి బ్యాన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఓ తమిళ సినిమా కోసం కాంట్రాక్ట్ మీద సైన్ చేసి అడ్వాన్స్ తీసుకున్న ఇలియానా.. తర్వాత ఆ చిత్రంలో నటించట్లేదని నిర్మాత ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో ఇలియానాదే తప్పు అని తేల్చిన నిర్మాతల మండలి ఆమెపై నిషేధం విధించినట్లు చెబుతున్నారు.
ఐతే ఇలియానా కెరీర్ దాదాపుగా క్లోజ్ అయిపోయాక ఆమె మీద నిషేధం విధించడం వల్ల పెద్దగా మార్పేమీ ఉండదని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. సౌత్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లిపోయాక కొన్నేళ్ల పాటు ఆమెకు మంచి ప్రయారిటీనే ఇచ్చారు అక్కడి ఫిలిం మేకర్స్. కానీ తర్వాత వాళ్లు కూడా పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు ఆమె బాద్‌షాతో చేసిన ఒక మ్యూజిక్ వీడియో ద్వారా లైమ్ లైట్లోకి రావాలని చూస్తోంది. గతంలో ఒక ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్‌తో కొన్నేళ్లు సహజీవనం చేసిన ఇల్లీ బేబీ.. తర్వాత అతడి నుంచి విడిపోయింది. ఇప్పుడు కత్రినా కైఫ్ సోదరుడితో ఆమె ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
This post was last modified on March 12, 2023 2:14 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…