వేణు వెల్దండి.. ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారిన పేరు. జబర్దస్త్ షోలో కామెడీ స్కిట్లు చేసుకుంటూ.. సినిమాల్లో చిన్న చిన్న కామెడీ రోల్స్ చేసిన అతడిలో ఒక మంచి అభిరుచి ఉన్న దర్శకుడు ఉన్నాడని ఇప్పుడే తెలుస్తోంది. ‘బలగం’ సినిమాతో అతను అందరినీ ఆశ్చర్యపరిచాడు. మలయాళం సినిమాలు చూసి మన దగ్గర ఇంత సహజమైన, నేటివిటీ ఫీల్ ఉన్న సినిమాలు రావని ఫీలయ్యే వారికి ‘బలగం’తో అతను సమాధానం చెప్పాడు. తెలంగాణ పల్లెటూరి కథను చాలా హృద్యంగా అతను చూపించిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
ఈ సినిమా చూసిన చాలామంది వేణులో ఇంత ప్రతిభ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఐతే ఇండస్ట్రీలో మాత్రం కొంతమందికి వేణు ప్రతిభ గురించి బాగానే తెలుసు. అతను ఇప్పటికే కొన్ని పేరున్న సినిమాలకు రచయితగా పని చేసిన విషయం ఇండస్ట్రీ జనాలకు మాత్రమే తెలుసు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో వేణు తాను పని చేసిన సినిమాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. ‘రుద్రమదేవి’ సినిమాకు హైలైట్‌గా నిలిచిన గోన గన్నారెడ్డి ఎపిసోడ్ చాలా వరకు వేణునే రాశాడట. అల్లు అర్జున్ చేసిన ఆ పాత్ర ఎంత బాగా పేలిందో తెలిసిందే. ఆ ట్రాక్ చాలా వరకు తానే రాశానని.. అది తెలిసి అల్లు అర్జున్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడని.. పలు సందర్భాల్లో తన గురించి చెప్పాడని వేణు తెలిపాడు. పక్కా తెలంగాణ యాసతో సాగే ఈ పాత్రకు డైలాగులు బాగా కుదిరాయి. బిత్తిరి సత్తి కూడా ఈ ట్రాక్ కోసం పని చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అలాంటి ట్రాక్ రాశాడంటే వేణు ప్రతిభ గురించి ఇండస్ట్రీ జనాలకు అప్పుడే అర్థమై ఉంటుందన్నమాట.
అంతే కాక ‘జై లవకుశ’ సినిమాలో ఒక యాక్షన్ ఎపిసోడ్ కూడా తాను రాసినట్లు వెల్లడించాడు వేణు. ‘బలగం’ తర్వాత వేణు గురించి ఇండస్ట్రీలో బాగానే చర్చ జరుగుతోంది. ‘బలగం’ చిత్రాన్ని నిర్మించి దిల్ రాజే వేణుతో ఇంకో సినిమా చేయబోతుండగా.. గీతా ఆర్ట్స్ సైతం తనతో ఓ సినిమా చేసేందుకు చూస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
This post was last modified on March 10, 2023 2:54 pm
యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఒకప్పుడు తెరను ఏలిన రాజశేఖర్ చాలా ఏళ్లుగా ట్రాక్ తప్పేశారు. తన సమకాలీకులైన సీనియర్…
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని.. ఇప్పటి వరకు ఊహిస్తున్న దానికి భిన్నంగా.. మరింత డెవలప్ చేసేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి…
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ దాడి దర్యాప్తులో కీలక పురోగతి నమోదైంది. బైసరన్ మైదానంలో అమాయక పర్యాటకులపై జరిగిన కాల్పులకు పాల్పడిన…
ఏపీలో వైసీపీ హయంలో జరిగిన మద్యం కొనుగోళ్లు.. విక్రయాల ద్వారా సుమారు రూ.2 - 3 వేల కోట్ల వరకు…
మూడేళ్లు కష్టపడితే రామ్ చరణ్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ ఇచ్చిన ఘనత గేమ్ ఛేంజర్ కే దక్కుతుంది.…
లోకేష్ టీంకు చాలానే పని పడిందా? ప్రజలకు ప్రభుత్వానికి మధ్య పెరుగుతున్న స్వల్ప గ్యాప్ ను తగ్గించాల్సిన అవసరం ఏర్పడిందా?…