కరోనా ఆ హీరోకి భలే ప్లస్ అయ్యింది!

కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా అష్టకష్టాలు పడుతోంటే మన హీరో నితిన్ కి మాత్రం ఈ బ్రేక్ భలే ప్లస్ అయ్యింది. అదెలా అంటే.. ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోవాలని నితిన్ ముందే డిసైడ్ అయ్యాడు. కాకపోతే గత ఏడాది తన సినిమాలేవీ రిలీజ్ అవలేదని ఈ ఇయర్ వరసపెట్టి సినిమాలు ప్లాన్ చేసుకున్నాడు.

ఒకవేళ పరిస్థితులు మామూలుగా ఉండుంటే నితిన్ కి ఇంత తీరిక దొరికి ఉండేది కాదు. పెళ్ళికి కూడా తన షూటింగ్స్ మధ్య టైమ్ కేటాయించుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా పెళ్లి చేసేసుకున్నాడు. అలాగే పెళ్లి తర్వాత వెంటనే షూటింగ్స్ అంటూ హడావిడి పడాల్సిన పని కూడా లేదు.

నితిన్ సినిమాల్లో రంగ్ దే ఇంకా ఇరవై రోజుల షూటింగ్ జరుపుకోవాల్సి ఉంది. అంధాదున్ రీమేక్, యేలేటి డైరెక్షన్లో చేస్తున్న చెక్ షూటింగ్స్ వచ్చే ఏడాదిలోనే ఉంటాయి. రంగ్ దే ఈ ఇయర్ ఎండ్ లోగా పూర్తి చేసేసి సంక్రాంతికి విడుదల చేద్దామనే ఆలోచనలో ఉన్నారు.