అపరిచితుడు.. భార్యకు సారీ చెప్పడండీ

మన దగ్గర ఎప్పుడో రేర్ గా హృతిక్ రోషన్ వంటి స్టార్లు అలాంటి పనులు చేస్తుంటారు కాని, హాలీవుడ్ లో అయితే రెగ్యులర్ గా ఇలాంటి యవ్వారాలు జరుగుతూనే ఉంటాయ్. భార్యతో డైవర్స్ తీసుకుంటున్నా, భర్తతో విడిపోతున్నా అంటూ అక్కడ స్టార్లు , సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటారు. ఈ మధ్యనే నడుం అందాల సుందరి కిమ్ కర్దాషియన్ విషయంలో కూడా అదే జరిగింది.

రియాల్టీ స్టార్ గా ఎంట్రీ ఇచ్చి, తరువాత బ్యూటి ప్రొడక్ట్స్ అమ్ముకుంటూ కిమ్ కర్దాషియన్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈమె ర్యాప్ సింగర్ కాన్యే వెస్ట్ ను 2014లో తన మూడవ భర్తగా వివాహమాడింది. అయితే ఈ మధ్యన కిమ్ వేరే అబ్బాయితో చనువుగా ఉంటుందనే రూమర్లు చాలానే బయటకొచ్చాయి. ఈ తరుణంలో తన భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అంటూ కాన్యే వెస్ట్ తన ట్విట్టర్లో పోస్టు చేశాడు. కాని అరగంటలో వాటిని డెలీట్ చేశాడు.

ఈ యవ్వారంపై స్పందించిన కిమ్.. తమ కాపురంలో అంతా బాగానే ఉందని, కాకపోతే తన భర్తకు స్ల్పిట్ పర్సనాలిటీ డిజార్టర్ ఉందని.. కాబట్టి అతను ఏం చేసినా చెప్పినా వాటిని అపార్ధం చేసుకోవద్దని, అతన్ని క్షమించాలని ఆమె ఇనస్టాగ్రాములో షేర్ చేసింది. ఇదంతా చూసి మన సమంతతో సహా అందరూ కిమ్ ను తెగ పొగిడేశారు. ఇక ఫైనల్ గా ఆమె భర్త.. సదరు అపరిచితుడు హీరో లక్షణాలున్న కాన్యే కూడా స్పందించాడు.

‘ఒక పర్సనల్ విషయాన్ని నువ్వు చూసిన కోణంలో నేను చూడలేకపోయాను. మనలో మనం మాట్లాడుకోవాల్సిన విషయాన్ని నేను నలుగురిలో మాట్లాడి నిన్ను బాధపెట్టినందుకు నన్ను మణ్ణించు. నువ్వు నా కోసం నా వెంటే నుంచున్నట్లు నేను నీ కోసం నిలబడలేకపోయాను’ అంటూ ఒక ‘అపాలజీ’ పోస్టు చేశాడు కాన్యే వెస్ట్. అయితే ఇదంతా చూస్తుంటే, వీరిరువురూ డైవర్స్ తీసుకోవడం మాత్రం పక్కా అనిపిస్తోంది అంటున్నారు హాలీవుడ్ మీడియావారు.