చూస్తుంటే కల సాకారమయ్యే రోజు అతి దగ్గరలోనే ఉందనిపిస్తోంది. ఇంకో పది రోజుల్లో జరగబోతున్న ఆస్కార్ సంరంభం కోసం ఈసారి దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ నుంచి అఫీషియల్ గా నామినేషన్ గెలుచుకున్న నాటు నాటుకి అవార్డు ఖాయమనే అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయని ఇటీవలి పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. తాజాగా ఈ పాటను స్టేజి మీద లైవ్ లో పాడి వినిపించేందుకు రమ్మని గాయకులు రాహుల్ సిప్లిగుంజ్, కాలభైరవలకు అకాడమీ నుంచి అధికారికంగా ఆహ్వానం అందింది. ఆ మేరకు సంస్థే ట్వీట్ చేసింది.
ఇప్పటికే ఈ ఈవెంట్ కోసం యుఎస్ లో రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి, కార్తికేయ తదితరులతో ఈ ఇద్దరూ సింగర్స్ జాయినవుతారు. ఈ 6వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణం కాబోతున్నాడు. తారకరత్నపెద్ద కర్మ పూర్తవ్వడంతో పాటు ఇతరత్రా పనులన్నీ అయిపోవడంతో ఆస్కార్ టీమ్ తో చేతులు కలపనున్నాడు. గతం వారం రోజులుగా చరణ్ సోషల్ మీడియాలో ఇద్దరి హీరోల ఫ్యాన్స్ నానా యాగీ చేసి వ్యవహారాన్ని దూరం తీసుకెళ్లారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ స్వయంగా క్లారిటీ ఇచ్చేదాకా వెళ్లిందంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు.
మాములుగా లైవ్ గా పాడాలని పిలిచారంటే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటేనే చేస్తారు. మరోవైపు తారక్ చరణ్ ఇద్దరూ దానికి తగ్గట్టు అక్కడే డాన్స్ చేస్తారా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. అవార్డు వస్తే చేస్తామని సంకేతాలు గతంలో ఇచ్చారు కానీ పన్నెండో తేదీ వస్తే కానీ ఈ చిక్కుముడి వీడదు. గతంలో ఏ భారతీయ సినిమాకు దక్కనంత ప్రతిష్టను గౌరవాన్ని సంపాదించుకున్న ఆర్ఆర్ఆర్ ఎల్లుండి నుంచి యుఎస్ లో మళ్ళీ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇంకో ఇరవై రోజుల్లో మొదటి యానివర్సరీ రాబోతున్న టైంలోనూ హౌస్ ఫుల్స్ నమోదు కావడం గమనార్హం.
This post was last modified on %s = human-readable time difference 11:09 am
ఏపీ సీఎం చంద్రబాబు అంటే రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. డ్వాక్రా సంఘాలను ఏపీ మహిళలకు…
విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండపై ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే.…
దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలిగిపోతోంది. కన్నడ అనువాదం ‘బఘీర’ను మినహాయిస్తే మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేస్తున్నాయి.…
ఆగస్టు 15 వీకెండ్లో ‘స్త్రీ-2’ అనే మిడ్ రేంజ్ సినిమా ఒకటి రిలీజైంది. దాంతో పాటు అక్షయ్ కుమార్ ముఖ్య…
తెలంగాణ రాజకీయాలు రసపట్టుగా మారుతున్నాయి. ఇప్పుడు రాజకీయం అంతా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతుందనుకుంటున్న తరుణంలో…
పటాసుల పండగ అయిపోయింది. బాక్సాఫీస్ మతాబులు పెద్ద శబ్దం చేస్తూ భారీ ఎత్తున ట్రేడ్ కు సంబరాలు తెచ్చిపెట్టాయి. వందల…