టాలీవుడ్ లో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో మొదటి పేరు ఎవరయ్యా అంటే ఇంతకు ముందు పూజా హెగ్డే, రష్మిక మందన్న పేర్లు వినిపించేవి. కానీ మెల్లగా ఇప్పుడు శ్రీలీల వీళ్లకు గట్టి పోటీ ఇచ్చే దిశగా జింకపిల్లలా పరుగులు పెడుతోంది, పెళ్లి సందDతో ఎంట్రీ ఇచ్చి కేవలం తన గ్లామర్ ప్లస్ డాన్సులతో థియేటర్లకు జనం వచ్చేలా చేసిన ఈ భామ తాజాగా ధమాకాలో చేసిన రచ్చ ఆడియన్స్ ఇప్పట్లో మర్చిపోలేరు. మాస్ మహారాజా రవితేజ లాంటి పవర్ హౌస్ ని పక్కనపెట్టుకుని ఆయన ప్రెజెన్స్ ని డామినేట్ చేసే స్థాయిలో మెప్పించడమంటే మాటలు కాదు.
ఇప్పుడు మరో పవర్ ఫుల్ ఆఫర్ తలుపు తట్టనుందని లేటెస్ట్ అప్ డేట్. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందబోయే ఉస్తాద్ భగత్ సింగ్ లో హీరోయిన్ గా తనే ఎంపిక కావొచ్చట. డేట్ల వ్యవహారాలు వగైరా అన్నీ కుదిరితే లాక్ చేసే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు ముందు అనుకున్న పేర్లు పూజా హెగ్డే. తర్వాత అసలు కథను మార్చేసి తేరి రీమేక్ ని తెరమీదకు తేవడంతో పాటు షూటింగ్ ప్రారంభంలో విపరీతమైన ఆలస్యం జరగడంతో పూజా ఇష్టం లేకపోయినా తప్పుకోక తప్పలేదు.
ఇప్పుడు అన్నీ కుదురుకున్నా తన కాల్ షీట్లు దొరికే సీన్ లేదు. పవన్ పక్కన వయసురిత్యా శ్రీలీల జోడి ఆనుతుందా లేదా అనే డౌట్ అక్కర్లేదు. ధమాకా టైంలోనూ ఇలాంటి కామెంట్స్ వస్తే తర్వాత అవి దూదిపింజెల్లా ఎగిరిపోయాయి. ఇప్పుడూ అదే జరగొచ్చు. ప్రస్తుతం వినోదయ సితం రీమేక్ ని వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్న పవన్ ఆ తర్వాత ఏప్రిల్ నుంచి ఉస్తాద్, ఓజిలకు సమానంగా డేట్లు ఇచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు. ముందు ఏది పూర్తవుతుందనేది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. మధ్యలో హరిహరవీరమల్లు కూడా ఉంటుంది కాబట్టి అన్నీ బ్యాలన్స్ చేసుకోవాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates