నేనూ బీ గ్రేడ్ యాక్టర్ నే!

తాప్సి, స్వర భాస్కర్ లాంటి టాలెంట్ ఉన్న నటీమణులు కూడా బాలీవుడ్ లో బి గ్రేడ్ యాక్టర్లగానే ఉండిపోయారని, వారి స్టేటస్ లో ఎప్పటికీ మార్పు రాదని, ఆలియా భట్, అనన్య పాండే లాంటి వారికి దక్కే అవకాశాలు వారికి దక్కవని కంగన వ్యాఖ్యానించింది. తనను బి గ్రేడ్ గా అభివర్ణించడం తాప్సికి నచ్చలేదు. దానిపై ఓపెన్ సెటైర్స్ వేసింది. పలువురు కంగనా వ్యాఖ్యలను తప్పుబట్టారు.

అయితే తన వ్యాఖ్యలను కంగన సమర్ధించుకుంది. తానూ కూడా బి గ్రేడ్ యాక్టర్ నే అని, ఇక్కడ ఇమడడం కోసం తనను తాను ఎన్నో రకాలుగా మలచుకున్నానని, ఇష్టం లేని పాత్రలు పోషించానని, జుట్టు, పెదవులు సరి చేయించుకున్నానని, ఎన్ని చేసినా కానీ తనను బయటి వ్యక్తిగానే చూస్తుంటారు తప్ప తమలో ఒకరిగా చూడరని, తనలాంటి వారికోసమే ఇప్పుడు పోరాడుతున్నాని కంగన వివరణ ఇచ్చింది.

మరి ఇప్పటికి అయినా తాప్సి ఈమె వైపు మొగ్గుతుందా… లేక ఇంకా కంగన వ్యాఖ్యలను తప్పుబడుతుందా?