త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కంప్లీట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న మహేష్ బాబు 28కి ప్రస్తుతం చిన్న బ్రేక్ ఇచ్చారు. విదేశాలకు వెళ్లిన మహేష్ తిరిగి రాగానే కొత్త షెడ్యూల్ మొదలుపెడతారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడంతో ఇందులో పాత్రలు ఎక్కువగా ఉన్నాయి. క్యాస్టింగ్ కే బోలెడు టైం పట్టింది. దీని కథ ప్రకారం ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. పూజా హెగ్డేని అఫీషియల్ గా ఎప్పుడో ప్రకటించగా ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో శ్రీలీల ఉందన్న విషయం నిర్మాత నాగ వంశీ ఖరారు చేశారు. ఇంకొకరు కావాల్సింది.
టాలీవుడ్ లో రెండు మూడు ఆప్షన్లు ట్రై చేసినా వర్కౌట్ కాకపోవడంతో ఫైనల్ గా బాలీవుడ్ వెళ్లిపోయారట. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం థర్డ్ బ్యూటీగా భూమి పెడ్నేకర్ ని తీసుకున్నారని సమాచారం. అక్షయ్ కుమార్ సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈ భామకు హిందీలో మంచి హిట్సే ఉన్నాయి. అదరహో అనిపించే అందం లేకపోయినా మంచి పెర్ఫార్మర్. పైగా రెమ్యునరేషన్ కూడా భారీ డిమాండ్ ఉండదు. అందుకే స్టోరీలో కీలకమైన పాత్రకు తనైతేనే న్యాయం చేకూరుస్తుందని త్రివిక్రమ్ భావించడం వల్ల దాదాపు తనే ఓకే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఒకవేళ నిజమైతే భూమికిది మంచి ఛాన్సే. కాకపోతే పాత్ర పరిధి ఎంత ఉంటుందో చూడాలి. అఆలో అనుపమ లాగా అయితే ఓకే కానీ అరవింద సమేత వీరరాఘవలో ఈషా రెబ్బ లాగా అయితే కష్టం. మొత్తానికి బ్రేకులు పడటం కొనసాగుతూనే ఉన్న ఈ మూవీని ముందు చెప్పినట్టు ఆగస్ట్ 11 రిలీజ్ చేయడం అనుమానమే. టాకీ పార్టే ఇంకా పూర్తి స్థాయిలో జరగడం లేదు. అయిదు పాటలు మొదలుపెట్టాల్సి ఉంది. తమన్ ట్యూన్స్ ఇచ్చేసి ఓ టెన్షన్ తగ్గించాడు. టబు, నదియా తరహాలో మరో సీనియర్ ఫిమేల్ లీడ్ ఇందులో అవసరమట. శోభన కోసం ట్రై చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్.
This post was last modified on February 21, 2023 1:03 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…