నిన్న చెప్పుకోదగ్గ పోటీ లేకుండా మైత్రి బ్యానర్ నిర్మాణం కావడంతో అమిగోస్ కి మంచి రిలీజ్ దక్కింది. ఎన్ని స్క్రీన్లు కావాలన్నా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆశించిన స్థాయిలో హైప్ ముందు నుంచే కాస్త తక్కువగా ఉండటం వల్ల దాని ప్రభావం ఓపెనింగ్స్ మీద పడినట్టు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల ఫస్ట్ డే షేర్ రెండు కోట్లకు అటు ఇటు ఉంటుందని ట్రేడ్ టాక్. స్పష్టమైన ఫిగర్లు తెలియాల్సి ఉంది. దాంట్లో హెచ్చుతగ్గులు ఎన్ని ఉన్నా ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని సైతం మెప్పించిన బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రావాల్సిన స్పందన మాత్రం ఇది కాదని చెప్పాలి.
దీనికి కారణాలు ఎన్ని ఉన్నా అసలు అమిగోస్ అనే టైటిలే మాస్ కి రిజిస్టర్ కాలేదు. అలా అని జనం ఇలాంటివి రిసీవ్ చేసుకోరని కాదు. బాలయ్య లెజెండ్ అన్నప్పుడు యాక్సెప్ట్ చేశారుగా. కానీ కళ్యాణ్ రామ్ కు వచ్చేటప్పటికీ తనకు బాబాయ్ అంత మార్కెట్ లేకపోవడం వల్ల ఇలాంటి విషయాల్లో ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. పైగా అమిగోస్ ట్రైలర్ లో ఇది కంప్లీట్ క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ అనే మెసేజ్ ఇవ్వడంతో ఎంటర్ టైన్మెంట్ కోరుకునే సగటు జనాలు మొదటి రోజు దూరంగా ఉండిపోయారు. అసలు టాక్ రావడానికి ముందు స్పెషల్ షోలూ కొన్నిచోట్ల ఫుల్ కాలేదు.
అమిగోస్ ఫైనల్ స్టేటస్ తేలడానికి ఇంకో వారం పడుతుంది కానీ ఇప్పుడొచ్చిన టాక్ కి రివ్యూలకు వీకెండ్ హౌస్ ఫుల్స్ ఆశించడం కష్టమే. నిజానికి బాక్సాఫీస్ వద్ద ఆడియన్స్ కి పెద్దగా ఆప్షన్లు లేవు. సంక్రాంతి సినిమాల నుంచి పఠాన్ దాకా అన్నీ డ్రై అయిపోయాయి. ఆల్మోస్ట్ అందరూ చూసేశారు. సో థియేటర్ కు వెళ్లాలంటే అమిగోస్ ఒకటే ఛాయస్. కరెక్ట్ గా హిట్ టాక్ వచ్చి ఉంటే ఆ ట్రెండ్ రెండో రోజు ఉదయానికే వసూళ్ల పెరుగుదలలో చూపించేది. కానీ అలా జరగలేదు. విలనిజం సీరియస్ నెస్ ఎక్కువుందనే మాట ప్రచారం కావడంతో కుటుంబాలు కదలడం లేదు. సోమవారానికి క్లారిటీ వచ్చేస్తుంది.