Movie News

కొండారెడ్డి బురుజు సాక్షిగా RC లీక్స్

టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ ప్యాన్ ఇండియా రిలీజుల్లో ఒకటైన ఆర్సి 15 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ చార్మినార్ నుంచి కర్నూలు కొండారెడ్డి బురుజుకి షిఫ్ట్ అయ్యింది. భారీ జనసందోహం మధ్య ఉదయం అయిదు గంటల నుంచే షూటింగ్ చేస్తున్నారు. తెల్లవారుఝామున కాబట్టి ట్రాఫిక్ పెద్దగా ఉండదనే అంచనాలు తలకిందులు చేస్తూ పబ్లిక్ విపరీతంగా గుమికూడారు. పరిస్థితి పోలీసులు లాఠీ ఛార్జ్ చేసే దాకా వచ్చింది. చిత్రీకరిస్తున్న సన్నివేశం శ్రీకాంత్ రాజకీయ పార్టీ ప్రచారానికి కావడంతో దానికి అవసరమైన క్రౌడ్ కంటే ఎక్కువ అక్కడ పోగయ్యింది.

ఈ సినిమాను ముందు నుంచి లీకులు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు షూట్ తాలూకు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దిల్ రాజు నిర్మాణ సంస్థ తరఫున ఎప్పటికప్పుడు ట్విట్టర్ ఇన్స్ టాలో వీటిని డిలీట్ చేయిస్తున్నా పదే పదే కొత్త రూపాల్లో ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయి. అభ్యుదయం పార్టీ తరఫున శ్రీకాంత్ రామ్ చరణ్ తదితరులు పాల్గొన్న సీన్లు పరస్పరం బురుజు ఎత్తు పైనుంచి కౌగిలించుకునే విజువల్స్ అన్నీ ఫ్యాన్స్ కెమెరాలో బందించేశారు. పబ్లిక్ ముందు కాబట్టి ఎంత ప్రయత్నించినా వీటిని కట్టడి చేయడం అసాధ్యం.

ఆ మధ్య వీరసింహారెడ్డికి ఇదే లొకేషన్ లో అచ్చం ఇలాంటి సమస్యే వచ్చింది. పెద్ద బాలయ్య పాత్ర అంతిమయాత్ర సహజంగా ఉండాలనే ఉద్దేశంతో బురుజు పరిసరాల్లో తీయడంతో కీలకమైన ఆ విషయం ముందే తెలిసిపోయింది. ఇప్పుడు ఆర్సి 15కూ ఈ బెడద తప్పడం లేదు. శంకర్ జెంటిల్ మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, ప్రేమికుడు ఇలా ఏ సినిమా తీసుకున్నా అందులో నగరం నడిబొడ్డున భారీ ఎత్తున పబ్లిక్ పోగైన ఎపిసోడ్ ఖచ్చితంగా ఉంటాయి. జూనియర్ ఆర్టిస్టులతో చేయడం కన్నా ఇలానే ఇష్టపడతారు శంకర్. అప్పుడంటే లీకులు లేవు కాబట్టి సరిపోయింది కానీ ఇప్పుడలా కాదుగా.

This post was last modified on February 10, 2023 9:37 pm

Share

Recent Posts

డ్రాగన్ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి

ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…

12 minutes ago

సెటైర్లు సీరియస్‌గా తీసుకోనవసరం లేదు

నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…

3 hours ago

డబ్బింగ్ సినిమాల రేట్ల పెంపు సబబేనా

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…

3 hours ago

మార్చాల్సింది జ్ఞానేష్‌నా.. వ్య‌వ‌స్థ‌నా?!

ఒక ఇంట్లో దొంగ ప‌డ్డాడు. న‌గ‌లు, నట్రా దోచుకున్నాడు. య‌జ‌మాని ... ఆ దొంగ‌ను గుర్తించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.…

5 hours ago

బుమ్రా, పాండ్యా లేకుంటే అంతేనా…

టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…

6 hours ago

గ్రీన్‌కార్డ్ షాక్… ఐటీ కంపెనీలు ఏమంటున్నాయి?

అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…

6 hours ago