టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థగా దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ కి ఈ ఏడాది బ్రహ్మాండంగా మొదలైంది. ఇద్దరు పెద్ద హీరోల సినిమాలను ఒకేసారి రిలీజ్ చేయడం గురించి రిస్క్ అని సాహసమని ఎందరు వారించినా వెనక్కు తగ్గకుండా స్వంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ మొదలుపెట్టి మరీ బ్లాక్ బస్టర్స్ కొట్టడం వీళ్ళకే చెల్లింది. మొన్న జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టు బహుశా టాలీవుడ్ చరిత్రలోనే ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి రెండు భారీ చిత్రాలు విజయవంతం కావడం ఇదే మొదటిసారి. వాల్తేరు వీరయ్య ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ లో చోటు సంపాదించుకోగా వీరసింహారెడ్డి బాలయ్య టాప్ వన్ స్థానాన్ని తీసుకుంది.
ఇప్పుడు అమిగోస్ వంతు వచ్చింది. రేపు రిలీజ్ కాబోతున్న ఈ డిఫరెంట్ థ్రిలర్ లో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేయడం ప్రధాన ఆకర్షణ. అందులో ఒకటి పాత్ర విలన్ కావడం మరో పెద్ద ట్విస్టు. ప్రమోషన్లు గట్రా బాగానే చేస్తున్నారు. రేపు చెప్పుకోవడానికి తొమ్మిది సినిమలు థియేటర్లలో వస్తున్నా వాటిలో హైప్ ఉన్నది ఒక్క అమిగోస్ కు మాత్రమే. అడ్వాన్స్ బుకింగ్స్ మరీ దూకుడుగా లేవు కానీ ఉదయం ఆటకు పాజిటివ్ టాక్ వస్తే చాలు బింబిసార లాగా అనూహ్యంగా స్పీడ్ పెంచుకోవచ్చు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లని ట్రేడ్ టాక్. ఇప్పుడున్న పరిస్థితిలో ఇదేమి అసాధ్యం కాదు
గత ఏడాది మైత్రికి వరస షాకులు తగిలాయి. అంటే సుందరానికి ఆశించిన ఫలితం దక్కలేదు. పార్ట్ నర్ షిప్ తీసుకున్న హ్యాపీ బర్త్ డే ధబాలున పడిపోయింది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి డిజాస్టర్ అయ్యింది. సర్కారు వారి పాట హిట్టే కానీ అదీ అనుకున్న రేంజ్ కి వెళ్లలేకపోయింది. వీటికి తోడు పుష్ప 2 షూటింగ్ లో జరిగిన విపరీతమైన ఆలస్యం, రష్యా ప్రమోషన్ల కోసం పెట్టిన ఖర్చు వర్కౌట్ కాకపోవడం ఇవన్నీ కొంత ప్రతికూల ప్రభావం చూపించాయి. ఇప్పుడు మొత్తం మారిపోయింది. బాక్సాఫీస్ ఎలాగూ డల్ గా ఉంది కాబట్టి అమిగోస్ ఆ అవకాశాన్ని వాడుకుంటే లాభాల పంటే