హీరో అయిన ప్రతి ఒక్కరికీ మాస్ ని మెప్పించాలని ఉంటుంది. ఎందుకంటే మాస్ హీరో అనిపించుకున్నాకే ఎవరికి అయినా ఒక రేంజ్ వస్తుంది, మార్కెట్ పెరుగుతుంది. ప్రేమ కథాచిత్రాలు, హాస్య సినిమాలు చేస్తూ వుంటే సక్సెస్ వచ్చినా కానీ ఫాలోయింగ్ పెరగదు, ఫ్యాన్ క్లబ్స్ ఏర్పడవు.
అందుకే ప్రేమకథా చిత్రాలతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న నాగ శౌర్య ‘అశ్వద్ధామ’ చిత్రం కోసం కండలు బిగించాడు. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా కానీ నాగ శౌర్యకు ఇంకా మాస్ హీరో సరదా తీరలేదు. అందుకే తనను అలా చూపించే కథల కోసం అన్వేషిస్తున్నాడు. అంతే కాదు తన దగ్గరకు వచ్చే దర్శకులు తనను యాక్షన్ హీరోలా చూడాలని ఈ లాక్ డౌన్ లో విపరీతంగా కండలు పెంచేసాడు.
అశ్వద్ధామకు కథ రాసుకున్నట్టే మళ్ళీ తానే ఒక కథ సిద్ధం చేసుకున్నాడట. వీలుంటే బయటి నిర్మాతకు లేదా తన సొంత నిర్మాణ సంస్థలోనే ఈ సినిమా చేసేస్తాడట. మరి నాగశౌర్య ఈసారి అయినా మాస్ హీరోగా తాను కోరుకుంటున్న సక్సెస్ సాధిస్తాడా లేక ఉన్న లవర్ బాయ్ ఇమేజ్ కి కూడా ఇబ్బంది తెచ్చుకుంటాడా?
Gulte Telugu Telugu Political and Movie News Updates