గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది. అందరు హీరోల అభిమానులు చాలా మంది అందులో కంటెంట్ కి పర్సనల్ గా కనెక్ట్ అయిపోయి దర్శకుడు మహేష్ బాబు, హీరో రామ్ మీద ప్రశంసలు గుప్పించారు. తీరా చూస్తే బాక్సాఫీస్ వద్ద రివర్స్ ఫలితం వచ్చింది. బొమ్మ ఆడలేదు.
కనీసం యావరేజ్ అవుతుందనుకుంటే కలెక్షన్లు సారీ చెప్పేశాయి. దీంతో రామ్ నిరాశ చెందాడు. ఆన్ లైన్ పొగడ్తలకు, గ్రౌండ్ రియాలిటీకి చాలా తేడా ఉందని ఇండస్ట్రీ జనాలకు అర్థమయ్యింది. అయినా సరే ఇప్పటికీ ఆంధ్రకింగ్ తాలూకా డీసెంట్ మూవీగానే నిలుస్తుంది.
తాజాకా కపుల్ ఫ్రెండ్లి చూస్తుంటే రామ్ చవిచూసిన అనుభవమే సంతోష్ శోభన్ కు దక్కుతుందానే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ప్రీమియర్ల దగ్గరి నుంచే ఈ సినిమాకు సానుకూల స్పందన ఉంది. ఎమోషనల్ డ్రామాని బాగా చూపించారంటూ మూవీ లవర్స్ ఆనందం వ్యక్తం చేశారు.
ప్రమోషన్ల కోసం సంతోష్ శోభన్, మానస వారణాసి కంటిన్యూగా ట్రిప్పులు కొడుతూనే ఉన్నారు. కానీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా మేజిక్ జరగడం లేదు. నగరాల్లో మల్టీప్లెక్సులు మినహాయించి బిసి సెంటర్లలో రెస్పాన్స్ అటుఇటుగానే ఉంది. టైటిల్ తో పాటు కంటెంట్ మరీ ఎక్కువ ఎమోషనల్ గా ఉండటం ఫ్యామిలీస్, మాస్ ని దూరం పెట్టినట్టు ఉంది.
దీన్ని బట్టి ఒకటి అర్థం చేసుకోవాలి. మంచి సినిమా తీసినంత మాత్రాన భారీ డబ్బులు వచేస్తాయన్న గ్యారెంటీ లేదు. ఏ అంచనాలు లేకుండా లిటిల్ హార్ట్స్ ముప్పై కోట్లు లాగేసింది. రాజు వెడ్స్ రాంబాయి మొత్తం పెట్టుబడి ఒక్క నైజామ్ నుంచే వెనక్కు వచ్చింది.
వాటిలో ఉన్న ఎలిమెంట్స్ లో కపుల్ ఫ్రెండ్లిలో లేకపోయినా హృదయాన్ని హత్తుకునే ప్రేమకథ కాబట్టి అన్ని వర్గాలు ఆదరిస్తాయని నిర్మాతలు భావించారు. కానీ క్షేత్ర స్థాయి పరిస్థితి వేరుగా ఉంది. ఇంకా థియేటర్ రన్ కొనసాగుతోంది కాబట్టి రాబోయే వీకెండ్ కల్లా మళ్ళీ పికప్ అయితే కపుల్ ఫ్రెండ్లీ డీసెంట్ నుంచి హిట్టు వైపు వెళ్లొచ్చు. చూడాలి ఏం జరుగుతుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates