ఉత్తరాంధ్రుల ‘మెగా’ ప్రేమ

మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ స్టార్ హీరోల సినిమాలు ఏవైనా సరే.. మిగతా ఏరియాలతో పోలిస్తే ఉత్తరాంధ్రలో ఎక్కువ బాగా ఆడతాయి. ఆ ఏరియాలో మెగా హీరోల సినిమాలకు బిజినెస్‌ కూడా బాగా జరుగుతుంది. ఓపెనింగ్స్ కూడా భారీగా వస్తాయి. చిరుకు ముందు నుంచి అక్కడ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలు అక్కడ గతంలో అనేక రికార్డులు నెలకొల్పాయి.

చిరు రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’తో పాటు ‘సైరా’ సైతం అక్కడ భారీ వసూళ్లు రాబట్టింది. ఐతే ఆ తర్వాత ‘ఆచార్య’ మాత్రం అన్ని ప్రాంతాల్లో మాదిరే అక్కడా చతికిలపడింది. మళ్లీ ‘గాడ్ ఫాదర్’ ఓకే అనిపించింది. ఐతే దీని తర్వాత వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మాత్రం ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాల్లో మామూలుగా ఆడలేదు.

ఈ సినిమా కథ కూడా వైజాగ్‌లో జరిగేది కావడం.. చిరు ఇందులో ఉత్తరాంధ్ర యాస మాట్లాడ్డంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోయారు. రిలీజ్‌కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే ఉత్తరాంధ్రలో మంచి ఊపు చూపించిన ‘వాల్తేరు వీరయ్య’.. విడుదల రోజు నుంచి ప్యాక్డ్ హౌస్‌లతో నడిచింది. సినిమా మిగతా ఏరియాల్లో కూడా బాగా ఆడినా సరే.. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో మాత్రం టికెట్ ముక్క దొరకడం కష్టమైంది.

తొలి వీకెండ్లో డిమాండ్ అంతకంతకూ పెరిగి వేరే సినిమాలకు కొంచెం తగ్గించి దీనికి స్క్రీన్లు, షోలు పెంచాల్సి వచ్చింది. వీకెండ్ తర్వాత అన్ని చోట్లా వసూళ్లలో డ్రాప్ కనిపించగా.. వైజాగ్ ఏరియాలో మాత్రం మంచి ఆక్యుపెన్సీలతో నడిచింది సినిమా. ఇప్పుడు రిలీజై మూడు వారాలు దాటినా వీకెండ్లో ఈ చిత్రానికి ఇక్కడి థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీలు కనిపిస్తున్నాయి. శని, ఆదివారాల్లో హౌస్ ఫుల్స్ పడేలా ఉన్నాయి. మంచి షేర్ ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం వైజాగ్ ఏరియాలో రూ.20 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఫుల్ రన్లో రూ.25 కోట్ల మార్కును అందుకునేలా కనిపిస్తోంది.