పవన్ కళ్యాణ్ తో క్రిష్ ఏ ముహూర్తాన ‘హర హరవీరమల్లు’ సినిమా మొదలు పెట్టాడో తెలియదు కానీ అప్పటి నుండి ఈ ప్రాజెక్ట్ బ్రేకులు పడుతూనే ఉంది. ఎప్పటికప్పుడు ఒక షెడ్యూల్ కంప్లీట్ చేయడం మరో షెడ్యూల్ కి బ్రేక్ పడటం జరుగుతూ వస్తుంది. అయితే తాజాగా పవన్ మీద ఓ భారీ షెడ్యూల్ చేశారు మేకర్స్. యాక్షన్ ఎపిసోడ్ ఘాట్ చేసుకున్నారు. జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి లో మరో షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు.
కానీ ఇప్పుడు మళ్ళీ పవన్ కారణంగా షూటింగ్ బ్రేక్ పడబోతుంది. అవును వీరమల్లు కి కేటాయించిన డేట్స్ లో కొన్ని వినోదాయ సీతం రీమేక్ కోసం ఇస్తున్నాడు పవన్. ఫిబ్రవరి లో షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఈ రీమేక్ కోసం పవన్ ఇరవై రోజుల డేట్స్ ఇచ్చాడని సమాచారం. అయితే వీరమల్లును పక్కన పెడుతూ ఇలా మరో షూటింగ్ కి వెళ్తూనే ఉన్నాడు పవన్.
అసలే పొలిటికల్ మీటింగ్స్ పైగా మధ్యలో షూటింగ్ పవన్ ఫుల్ బిజీ. మరి వీరమల్లు మరో షెడ్యూల్ ఎప్పుడు మొదలువుతుందో ? అనే డైలమాలో మేకర్స్ ఉన్నారు. వినోదాయ సీతం రీమేక్ తర్వాత పవన్ మళ్ళీ పొలిటికల్ గా కూడా మరింత బిజీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి పొలిటిక్స్, మధ్యలో వీరమల్లు షూటింగ్ అప్పుడప్పుడు మరో సినిమా ఇలా పవన్ డైరీ కొనసాగుతుంది. ఇలా బ్రేకులు పడుతూ పోతే హరి హర వీరమల్లు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందో ?
Gulte Telugu Telugu Political and Movie News Updates