Movie News

అందరి చర్చ జూనియర్ గురించే

ఆస్కార్ నామినేషన్ల లిస్టు భారత కాలమాన ప్రకారం ఈ రోజు రాత్రి 7 గంటల తర్వాత ఏ క్షణంలో అయినా విడుదల కావొచ్చు. ఆర్ఆర్ఆర్ లో నటనకు గాను జూనియర్ ఎన్టీఆర్ పేరు ఉంటుందన్న అంచనాలు బలంగా ఉన్న నేపథ్యంలో, పలు విదేశీ మీడియా సంస్థలు సైతం ఈ విషయాన్ని బలపరచడంతో రాబోయే కొన్ని గంటలు యంగ్ టైగర్ ఫ్యాన్స్ కి సస్పెన్స్ థ్రిల్లర్ గా మారిపోయాయి. ఇప్పటికిప్పుడు అవార్డు రాదు కానీ ఆ జాబితాలో చోటు దక్కడం అంటే విజయావకాశాలు పెరిగినట్టే. పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ట్రిపులార్ కు దక్కే స్థానాల మీద హాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పటికే గోల్డెన్ గ్లొబ్ సాధించిన నాటు నాటు మాత్రం కన్ఫర్మ్ గా ఉంటుందని క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. ఇవన్నీ ప్రస్తుతానికి నిజమయ్యే అవకాశాలకు సాధ్యం కానీ అంచనాలకు మధ్యలో ఊగిసలాడుతున్న విశ్లేషణలు. సోషల్ మీడియాలో గత రెండు మూడు రోజులుగా ఈ విషయంలో తీవ్రమైన ట్రోలింగ్ లు గట్రా జరిగిపోతున్నాయి. అవతార్ దర్శకుడు జేమ్స్ క్యామరూన్ రాజమౌళితో చేసిన సంభాషణ అసలు ఉద్దేశం పక్కకెళ్లిపోయి ట్విటర్ లో దాని మీద ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఎంత రాద్ధాంతం చేసుకున్నారో అందరూ చూశారు. ఒకపక్క చరణ్ తారక్ ల స్నేహం బలపడుతుంటే అభిమానుల తీరు ఇలా ఉంది.

మొత్తానికి నామినేషన్లలో ఏ విభాగంలో చోటు దక్కినా దక్కపోయినా ఆర్ఆర్ఆర్ ఎప్పుడో ఇంటర్నేషనల్ లెవెల్ లో తన స్థాయిని చాటుకుంది. ఆస్కార్ వస్తే అదో ఘనత అవుతుంది తప్పించి ఒకవేళ మిస్ అయినా రాజమౌళి జీవితాంతం గర్వంగా చెప్పుకునే క్షణాలను విజయాలను వివిధ రూపాల్లో అందుకున్నాడు. లైఫ్ లో పెట్టుకున్న కొన్ని ముఖ్యమైన లక్ష్యాలను సాధించేశాడు. కాకపోతే ఈ ఒక్క ముచ్చటా తీరిపోతే టెన్షన్ లేకుండా మరింత కసితో మహేష్ బాబు ప్రాజెక్ట్ పనులు మొదలుపెట్టొచ్చు. చూద్దాం రాబోయే మరికొద్ది గంటల్లో పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయో ఏం చేయబోతున్నాయో.

This post was last modified on January 24, 2023 11:35 am

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

3 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

5 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

5 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

5 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

5 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

6 hours ago