మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో ఇప్పటిదాకా ఐదు సినిమాల్లో నటిస్తే అందులో రెండు రీమేక్‌లు. అసలాయన రీఎంట్రీనే రీమేక్ మూవీ అయిన ‘ఖైదీ నంబర్ 150’తో జరిగింది. దాని తర్వాత రెండు స్ట్రెయిట్ మూవీస్ చేసి.. మళ్లీ రీమేక్‌లో నటించాడు. అదే ‘గాడ్ ఫాదర్’. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’తో పెద్ద హిట్ కొట్టిన చిరు.. దీని తర్వాత చేస్తున్న ‘భోళా శంకర్’ రీమేకే అన్న సంగతి తెలిసిందే.
ఓటీటీల హవా పెరిగిపోయి అన్ని భాషల చిత్రాలనూ అందరూ చూసేస్తున్న ఈ రోజుల్లో రీమేక్‌ల పట్ల ఆసక్తి అంతకంతకూ తగ్గిపోతోంది. స్వయంగా ఆయా హీరోల అభిమానులే రీమేక్‌లు వద్దు మొర్రో అనేస్తున్నారు. అందులోనూ ‘వేదాళం’ లాంటి రొటీన్ మాస్ మూవీని.. మెహర్ రమేష్ లాంటి లైమ్ లైట్లో లేని దర్శకుడితో రీమేక్ చేస్తుండడంతో చిరు అభిమానులు కూడా ఈ సినిమా పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ఈ సినిమాను ఆపేస్తే బావుండన్న ఫీలింగ్ చాలామందిలో ఉంది.
‘భోళా శంకర్’ పరిస్థితి ఇలా ఉంటే.. చిరు కొత్తగా ఇంకో రీమేక్‌ను లైన్లో పెడుతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ‘వేదాళం’ హీరో అజిత్, దాని దర్శకుడు శివ కలిసి చేసిన మరో చిత్రం ‘విశ్వాసం’ను కూడా చిరు రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు జోరుగా వార్తలొస్తున్నాయి. కానీ తెలుగులో అనువాదం అయి తరచుగా టీవీలో ప్రసారం అవుతున్న సినిమాను రీమేక్ చేయడం ఏంటనే చర్చ మొదలైంది. ఎప్పట్లాగే అభిమానులే ఈ సినిమా వద్దంటూ అభ్యంతరాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. కానీ ఎవరు ఈ వార్త పుట్టించారో ఏమో కానీ.. అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నది మెగా కాంపౌండ్ సమాచారం. పీఆర్వోలు ఈ వార్తను ఖండించారు. చిరుకు ఈ సినిమాను రీమేక్ చేసే ఉద్దేశం ఎంతమాత్రం లేదని తేల్చేశారు.
‘గాడ్ ఫాదర్’ నిరాశ పరిచాక స్ట్రెయిట్ మూవీ అయిన ‘వాల్తేరు వీరయ్య’తో అంత పెద్ద హిట్ కొట్టిన చిరు.. ఈ రోజుల్లో రీమేక్‌లు చేయడం అంత సబబు కాదని బాగానే అర్థం చేసుకున్నారని.. ఆల్రెడీ కమిటై ఉండడం వల్ల ‘భోళా శంకర్’ పూర్తి చేయక తప్పదని.. దీని తర్వాత చిరు సమీప భవిష్యత్తులో రీమేక్‌లు చేయదల్చుకోలేదని.. అందులోనూ రొటీన్ మాస్ సినిమాల రీమేక్‌లు అసలే వద్దని ఆయన భావిస్తున్నారని సమాచారం.
This post was last modified on January 20, 2023 6:49 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…