Movie News

ముచ్చటగా మూడోసారి మెగా 2 మిలియన్

వాల్తేరు వీరయ్య తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యుఎస్ లోనూ విజయకేతనం ఎగరేసింది. రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ఇంకో రోజు బాకీ ఉండగానే సగర్వంగా 2 మిలియన్ డాలర్ క్లబ్బులో అడుగు పెట్టింది. ఖైదీ నెంబర్ 150తో కంబ్యాక్ ఇచ్చాక మెగాస్టార్ ఈ ఫీట్ మూడోసారి సాధించారు. ఆ మూవీతో సైరా నరసింహారెడ్డి ఈ ఫీట్ అందుకుంది. ఆచార్య విఫలం కాగా గాడ్ ఫాదర్ దూకుడు స్టడీగా ఉండలేకపోయింది. ఇలా మొత్తం మూడు సార్లు టూ మిలియన్ మైలురాయి అందుకున్న ఏకైక సీనియర్ స్టార్ గా చిరంజీవికి మరో రికార్డు దక్కింది. బాలయ్య, నాగ్, వెంకీలకు ఇది సాధ్యం కాలేదు.

ఇంకా రన్ చాలా ఉంది. ఫ్యాన్స్ ట్రిపుల్ బెంచ్ మార్క్ ని ఆశిస్తున్నారు కానీ అదంత సులభమైతే కాదు. అత్యధిక ప్రేక్షకులు వాల్తేరు వీరయ్యని చూసేశారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాగా విజువల్ ఎఫెక్ట్ కంటెంట్ కాదు కాబట్టి రిపీట్ ఆడియన్స్ ఎక్కువగా ఉండరు. అలా అని అసాధ్యమూ కాదు. ఒకవేళ సాధించగలిగితే అరుదైన ఘనతగానే చెప్పుకోవాలి. పోటీగా ఉన్న వీరసింహారెడ్డి సైతం 1 మిలియన్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత నెమ్మదించడంతో చిరుని అందుకోవడం జరగని పనే. మైత్రి మూవీ మేకర్స్ వాల్తేరు వీరయ్య ఓవర్సీస్ ఫిగర్ ని అఫీషియల్ గా ప్రకటించేసింది కనక సందేహాలేం లేవు.

తెలుగు రాష్ట్రాల్లోనూ చిరంజీవి దూకుడు స్టడీగానే ఉంది. పండగ సెలవులు అయిపోవడంతో నిన్నటి నుంచి స్పీడ్ తగ్గింది. టికెట్ రేట్ల పెంపుని పది రోజుల దాకా కొనసాగించాలని డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించుకోవడంతో ఈ వీకెండ్ కూడా ఇవే రేట్లే ఉంటాయి. సోమవారం నుంచి సాధారణ స్థితికి వచ్చాక అప్పుడు అక్యుపెన్సీలలో పెరుగుదల చూడొచ్చు. ఫస్ట్ వీక్ నైజాం డామినేషన్ స్పష్టంగా కనిపించగా తర్వాత కృష్ణా, ఆంధ్రా, గోదావరి జిల్లాల వైపు ఆధిపత్యం కనిపిస్తోంది. ఓవరాల్ షేర్ తొంబై కోట్లు దాటేసిన నేపథ్యంలో వంద కోట్ల మార్కు కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు

This post was last modified on January 19, 2023 1:47 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

55 minutes ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

2 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

3 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

9 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

11 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

12 hours ago