చావుని ఇలా కూడా క్యాష్ చేసుకోవచ్చు!

శవాల మీద పేలాలు ఏరుకుంటున్నాడు… అనే మాట వినే ఉంటారు. దాని తాత్పర్యం ఏంటనేది తెలియకపోతే కనుక బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ ఆత్మహత్యను క్యాష్ చేసుకునే బ్యాచ్ ని చూడొచ్చు. సుశాంత్ సింగ్ ది క్లియర్ సూసైడ్ అనేది తెలుస్తున్నా కానీ సంచలనం కోరుకునే బుర్రలు అది ఒప్పుకోవడం లేదు. అలాంటి బకరాలను టార్గెట్ చేస్తూ ఈ పేలాల బ్యాచ్ రెడీ అయిపోయింది. సుశాంత్ సింగ్ డి ఆత్మహత్యా, హత్యా అంటూ… సూసైడ్ ఆర్ మర్డర్ అంటూ సినిమా కూడా అనౌన్స్ అయింది.

ఇందులో హీరోగా కూడా సుశాంత్ పోలికలున్నాయని సోషల్ మీడియాలో వైరల్ అయిన సచిన్ తివారీని పెట్టుకున్నారు. సుశాంత్ కి సింపతీ వేవ్ ఉంది కనుక ఇక ఇందులో ఏమి చూపించినా నిజమనే అనుకుంటారు గొర్రె ట్రోల్స్. అందుకే ఈ మూడ్ చల్లారిపోయి, జనం ఈ చావు మరిచిపోక ముందే వేడి వేడిగా సినిమా వడ్డించేయాలని డిసైడ్ అయ్యారు. ఓటిటిలో రిలీజ్ చేసుకునే అవకాశం ఉంది కనుక కరోనా మహమ్మారి పీడిస్తున్న టైంలో కూడా షూటింగ్ మొదలు పెట్టేస్తున్నారు. అవును మరి… వేడి చల్లారితే పేలాలు రుచించవు కదా!