గత నెల రోజుల బాక్సాఫీస్ పరిణామాలు చూస్తుంటే ఇదే ప్రశ్న దర్శక నిర్మాతల మెదళ్లను తొలిచేస్తోంది. ఊర మాస్ కంటెంట్ కి ఏ స్థాయిలో పట్టడం కడుతున్నారో వసూళ్ల సాక్షిగా కళ్లారా చూస్తున్నాం. వాల్తేరు వీరయ్య సంక్రాంతి విజేతగా నిలిచి అయిదో రోజు కూడా దూసుకుపోతుండగా వీరసింహారెడ్డి సైతం వంద కోట్ల మైలురాయిని అందుకున్నట్టు నిర్మాతలే అధికారికంగా ప్రకటించారు. ఓవర్ క్లాస్ కంటెంట్ తో వచ్చిన కళ్యాణం కమనీయంని పట్టించుకునే నాథుడు లేకపోగా తెగింపు రెండో రోజే దారుణంగా పడిపోయింది. దిల్ రాజు మాస్టర్ ప్లానింగ్ వల్ల రొటీన్ కంటెంట్ ఉన్నా విజయ్ వారసుడుకి డీసెంట్ కలెక్షన్లు దక్కాయి.
డిసెంబర్ లో వచ్చిన ధమాకా ఎంత రొటీన్ అనిపించుకున్నా మాస్ ఆడియన్స్ అండతో బ్రహ్మాండమైన హిట్టు కొట్టింది. ఇవన్నీ విశ్లేషించుకుంటే ప్రేక్షకులు కేవలం కమర్షియల్ సినిమాలే ఇష్టపడుతున్నారా అనే సందేహం రావడం సహజం . ఇందులో వాస్తవం ఉన్నప్పటికీ ఏడాది పొడవునా కేవలం ఇలాంటి మసాలాలతో మెప్పించడం కష్టం. ఒక్క సంక్రాంతికి మాత్రమే కంటెంట్ కొంచెం అటుఇటు ఉన్నా స్టార్ హీరోలు గట్టెక్కిపోవడం చాలాసార్లు చూశాం. అల వైకుంఠపురములో ఎంత తీవ్రమైన పోటీ ఇచ్చినప్పటికీ సరిలేరు నీకెవ్వరుకి రికార్డులు దక్కడానికి కారణం ఇదే. దానికీ మొదటి రెండు మూడు రోజులు డివైడ్ టాకే నడిచింది.
ఈ ఫార్ములా కేవలం మాస్ ని బలంగా ఫుల్ చేయగలిగే స్టార్ హీరోలకు వర్తిస్తుంది తప్ప అందరికీ కాదు. రామ్, నాని లాంటి వాళ్ళు ఇంత ఈజీగా కమర్షియల్ మార్కెట్ ని ఫుల్ చేయలేరు. ఉదాహరణకు ధమాకాలో రవితేజ శ్రీలీల కాకుండా వేరే జంట అయ్యుంటే వంద కోట్ల గ్రాస్ కలలో మాటే. చిరు బాలయ్యలు కాబట్టే పాత కథలతో సైతం హౌస్ ఫుల్ బోర్డులు పెట్టగలిగారు. పులిని చూసి నక్క వాతబెట్టుకున్నట్టు అందరూ ఇదే రూటు పడితే బోర్లా పడటం ఖాయం. ఇలాంటివి రావాలి పరిమిత బడ్జెట్ లో వైవిధ్యమున్న చిత్రాలూ తీయాలి. అప్పుడే బ్యాలన్స్ జరిగి టికెట్ కౌంటర్లు పచ్చగా ఉంటాయి. అన్ని రోగాలకు ఒకటే మందు ఎలాగైతే సాధ్యం కాదో అన్ని సినిమాలకు మాస్ మంత్రం పని చేయదు.
This post was last modified on January 17, 2023 1:33 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…