చిరంజీవి , రవితేజ కాంబినేషన్ లో ఇది వరకు కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే రవితేజ హీరోగా మారి స్టార్ అయ్యాక ఈ కాంబో ఎవరూ సెట్ చేయలేదు. తనని పరిచయం చేసిన రవితేజ వాల్తేరు వీరయ్య లో ఉంటే బాగుంటుందని కథలో ఓ క్యారెక్టర్ ని యాడ్ చేసి ఈ క్రేజీ కాంబో ను సెట్ చేశాడు బాబీ. చిరు అభిమాని కావడంతో రవితేజ వెంటనే ఈ సినిమా ఒప్పుకోని డేట్స్ అడ్జస్ట్ చేశాడు. ఇక చిరంజీవి మీద తనకున్న అభిమానం పలు సందర్భాల్లో రవితేజ చెప్పుకోవడంతో మెగా ఫ్యాన్స్ కూడా రవితేజ పాత్రను ఇష్టపడ్డారు.
అయితే వాల్తేరు వీరయ్య లో రవితేజ లేకపోతే అన్నదమ్ముల సెంటిమెంట్ ఆ మాత్రం కూడా వర్కవుట్ అయ్యేది కాదు. వీరిద్దరికీ మంచి రాపో ఉండటంతో సెకండాఫ్ లో వచ్చే చిరు – రవితేజ పాత్ర తాలూకు సన్నివేశాలు బాగా పండాయి. ముఖ్యంగా చివర్లో తమ్ముడి సెంటిమెంట్ కొందరు ప్రేక్షకులకు కన్నీళ్ళు తెప్పించాయి.
దీంతో వాల్తేరు వీరయ్య సినిమా చూసిన కొందరు మెగా ఫ్యాన్స్ కి ఇందులో రవితేజ ప్లేస్ లో పవన్ ఉంటే అన్నదమ్ముల సెంటిమెంట్ ఇంకా వర్కవుట్ అయ్యేదని భావిస్తున్నారు. నిజానికి రవితేజ చేసిన పోలీస్ పాత్రలో పవన్ పర్ఫెక్ట్ గా సూటవుతాడు. కానీ కథలో ఆ పాత్ర మరణించడం వల్ల చిరు , బాబీ లకు పవన్ ఆలోచన వచ్చి ఉండదు. ఒక వేల పవన్ ఉంటే కథ మరోలా మార్చాల్సి వచ్చేదేమో. పవన్ ఎలాగో సినిమాలు చేస్తున్నాడు. చిరు కూడా స్పీడ్ పెంచాడు. మరి ఈ ఇద్దరి కాంబోలో ఇలాంటి అన్నదమ్ముల కథతో ఏదైనా సినిమా వస్తే మెగా ఫ్యాన్స్ కి పండగే. కలెక్షన్స్ కూడా రెండింతలు ఎక్కువ వస్తాయి. మరి మెగా బ్రదర్స్ ను కలిపే కథ ఎవరైనా రాసి చిరు , పవన్ లను అప్రోచ్ అయితే ఒప్పుకోకుండా ఉంటారా ?
This post was last modified on January 15, 2023 1:21 am
ఇతర రాష్ట్రాల్లో ప్రభాస్ కాకుండా ఒక తెలుగు హీరోకి ఇంత క్రేజ్ ఏమిటాని అందరూ ఆశ్చర్యపోయే రీతిలో పుష్ప 2…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
https://youtu.be/g3JUbgOHgdw?si=jpCbsxB5cP_qeRwA ఇతర రాష్ట్రాల్లో ప్రభాస్ కాకుండా ఒక తెలుగు హీరోకి ఇంత క్రేజ్ ఏమిటాని అందరూ ఆశ్చర్యపోయే రీతిలో పుష్ప…
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…