తమిళనాట ఫ్యాన్ వార్స్ అనే మాటెత్తగానే గుర్తుకొచ్చేది విజయ్, అజిత్ అభిమానులే. ఆఫ్ లైన్లో, ఆన్ లైన్లో వీళ్ల గొడవలు మామూలుగా ఉండవు. ఒకప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్‌ది తమిళనాడు బాక్సాఫీస్‌లో ఏకఛత్రాధిపత్యంగా ఉన్నంత వరకు పరిస్థితి బాగానే ఉండేది.
కానీ ఆయన జోరు తగ్గిపోయి నంబర్ వన్ స్థానానికి విజయ్, అజిత్ అభిమానుల మధ్య పోటీ మొదలయ్యాక కథ మారిపోయింది. మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అంటూ ఎవరికి వాళ్లు ఎలివేషన్లు ఇచ్చుకోవడం.. రికార్డుల కోసం కొట్టేసుకోవడం.. ఫేక్ కలెక్షన్లు వేయడం.. అవతలి హీరోను డీగ్రేడ్ చేయడం లాంటివి శ్రుతి మించిపోయాయి.
వేర్వేరు సమయాల్లో ఈ ఇద్దరు హీరోలు రిలీజైనా సరే.. తమ హీరోదే ఆధిపత్యం అని ప్రూవ్ చేయడానికి అభిమానులు వెయ్యాల్సిన ఎత్తులన్నీ వేస్తుంటారు. అలాంటిది ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి రిలీజైతే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతి కానుకగా ఒకే రోజు విజయ్ సినిమా ‘వారిసు’, అజిత్ మూవీ ‘తునివు’ రిలీజైన సంగతి తెలిసిందే.
విడుదలకు కొన్ని నెలల ముందే కొట్టేసుకుంటూ వచ్చిన విజయ్, అజిత్ ఫ్యాన్స్.. రిలీజ్ రోజు ఇంకా రెచ్చిపోయారు. తమ హీరో సినిమా సూపర్ అని చెప్పడం ఒకెత్తయితే.. అవతలి హీరో సినిమా వేస్ట్ అని డీగ్రేడ్ చేయడం మరో ఎత్తు.
ఇక కలెక్షన్ల విషయంలోనూ ఎవ్వరూ తగ్గట్లేదు. కింగ్ ఆఫ్ ఓపెనింగ్ అని అజిత్‌కు ఒకరు ఎలివేషన్ ఇస్తే.. కింగ్ ఆఫ్ కోలీవుడ్ అంటూ అవతలి వాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. కలెక్షన్ల విషయంలో ఎవ్వరూ తగ్గట్లేదు. తొలి రోజు తమిళనాడులో అజిత్ మూవీని నంబర్ వన్ అని అతడి ఫ్యాన్స్ క్లెయిమ్ చేసుకుంటుంటే.. ఓవరాల్ రికార్డు తమ హీరోదే అని విజయ్ ఫ్యాన్స్ అంటున్నారు.
మొత్తంగా మా హీరోది రికార్డంటే మా హీరోది రికార్డు అంటూ సోషల్ మీడియాలో తెగ కొట్టేసుకుంటున్నారు. వీరి గొడవలకు ఆజ్యం పోస్తూ పీఆర్వోలు కూడా రెండుగా విడిపోయి ఆయా హీరోలకు ఎలివేషన్లు ఇస్తూ.. రికార్డుల ముచ్చట్లు చెబుతున్నారు. మొత్తంగా నెవర్ బిఫోర్ అన్న స్థాయిలో కోలీవుడ్లో ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి ఈ సంక్రాంతికి.
This post was last modified on January 12, 2023 9:48 pm
యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల నటించిన మోగ్లీకి ఎదురీత తప్పడం లేదు. అఖండ తాండవం…
ఇంకో అయిదు రోజుల్లో అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ విడుదల కాబోతోంది. మాములుగా అయితే ఈపాటికి అడ్వాన్స్ ఫీవర్…
40 % ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో వచ్చిందని చెబుతున్న వైసిపికి అదే ఓటు బ్యాంకు నిలబడుతుందా లేదా అన్నది…
ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. ఒకటి రెండు కాదు స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఈసారి ఏకంగా…
అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని,…
ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా…