గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక కోసం యుఎస్ వెళ్లిన ఆర్ఆర్ఆర్ టీమ్ చేస్తున్న రచ్చ మాములుగా లేదు. విడుదలైన పది నెలల తర్వాత కూడా ఒక ఇండియన్ మూవీ గురించి ప్రపంచవ్యాప్తంగా ఈ స్థాయిలో మాట్లాడుకోవడం ఇదే మొట్టమొదటిసారని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
ఎలాగైనా ఆస్కార్ సాధించాలన్న రాజమౌళి పట్టుదల ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టనీయడం లేదు. దానికి తగ్గట్టే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు తమ పూర్తి సహకారం అందిస్తూ జక్కన్న ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్తూ అలసట లేకుండా తిరుగుతున్నారు. అక్కడి ఫోటోలు వీడియో బాగా వైరల్ అవుతున్నాయి
లాస్ ఏంజెల్స్ లోని చైనీస్ ఐమ్యాక్స్ థియేటర్ లో వెయ్యికి దగ్గరగా ప్రేక్షకుల మధ్య జరిగిన ప్రీమియర్, నాటు నాటు పాటకు లోకల్ నాన్ లోకల్ అనే తేడా లేకుండా ఏదో సి సెంటర్ లాగా స్క్రీన్ దగ్గరకి వెళ్ళి అందరూ డాన్సులు చేయడం ఇదంతా వర్ణించడం కన్నా ట్విట్టర్ లో వాటిని షూట్ చేసిన అభిమానుల హ్యాండిల్స్ చూస్తే బెటర్.
బెస్ట్ సాంగ్ నామినేషన్స్ లో తీవ్రంగా పోటీ పడుతున్న నాటు నాటుకి పురస్కారం ఖాయమని అక్కడి మీడియా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇతర విభాగాల సంగతేమో కానీ కమిటీ ప్రాధాన్య లిస్టులో ఇది ఉన్నట్టుగా లీకులను బట్టి తెలుస్తోంది
మార్చిలో జరగబోయే ఆస్కార్ ఈవెంట్ కోసం ఇదంతా ముందస్తు ప్రిపరేషన్ అనుకోవాలి. అకాడమీ సభ్యుల దృష్టిలో గత కొన్ని నెలలలుగా జరుగుతున్న పరిణామాలు దృష్టిలో లేకుండా పోవు. పైగా ఒక భారతీయ చిత్రం గురించి ఇంతగా చర్చ జరగడం గతంలో ఎన్నడూ లేనిది కావడంతో రోజులు గడిచే కొద్దీ ఆసక్తి పెరిగిపోతోంది.
తాజాగా ఉన్నట్టుండి రాకెట్రీ, కాంతారలు కూడా ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకున్నట్టు వచ్చిన వార్తలు ఆశ్చర్యం కలిగించాయి. వీటికి అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ ఏది ఏమైనా ఈసారి టాలీవుడ్ జెండా ఆస్కార్ లో ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. దానికి బలమైన పునాదే ఈ గోల్డెన్ గ్లోబ్
This post was last modified on January 11, 2023 12:23 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…