సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ కి తమన్ మ్యూజిక్ కంపోజర్ అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సాంగ్స్ బయటికొచ్చేశాయి. ఇంకా రెండు బిట్ సాంగ్స్ రాబోతున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకూ తమన్ ఒక్క ఈవెంట్ కి కూడా హాజరవ్వలేదు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా డుమ్మా కొట్టాడు. దీంతో తమన్ హై ఇచ్చే స్పీచ్ బాలయ్య ఫ్యాన్స్ మిస్ అవుతున్నారు. ఇక మాస్ మొగుడు సాంగ్ లాంచ్ లో అయిన తమన్ కనిపిస్తాడాని ఆశిస్తే అక్కడ కూడా వీర సింహా రెడ్డి టీమే కనిపించింది.
సాంగ్ లాంచ్ ఈవెంట్ లో మా బావ తమన్ ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాడు. చిన్న కరెక్షన్ చెప్పాను ఆ వర్క్ మీదే ఉన్నాడు అంటూ గోపీచంద్ చెప్పుకొచ్చాడు. దీంతో తమన్ ‘వీర సింహా రెడ్డి’ ఫైనల్ వర్క్ తో ఇంకా బిజీగా ఉన్నాడని బాలయ్య ఫ్యాన్స్ అర్థం చేసుకున్నారు.
ఏదేమైనా తమన్ కి ఈ సంక్రాంతి చాలా టఫ్ ఇచ్చింది. ఇటు ‘వీర సింహా రెడ్డి’ అటు ‘వారిసు’ మ్యూజిక్ వర్క్స్ రెండు బ్యాలెన్స్ చేస్తూ మధ్యలో మిగిలిన సినిమాలకి మ్యూజిక్ ఇస్తూ మేనేజ్ చేశాడు.
తాజాగా ఒకే స్టూడియోలో ‘వారిసు’ , ‘వీర సింహా రెడ్డి’ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తూ రెండు పోస్టులు కూడా పెట్టాడు. సో డబుల్ ఒత్తిడితో వీర సింహా రెడ్డి ఈవెంట్స్ కి డుమ్మా కొట్టిన తమన్ రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్ లో బాలయ్య గురించి గోపీచంద్ వర్క్ గురించి గట్టిగా చెప్పే ఛాన్స్ ఉంది.
రాధే శ్యామ్ సినిమా టైమ్ లో కూడా తన బిజీ షెడ్యూల్ లో రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ లో కనిపించకుండా పోస్ట్ రిలీజ్ కి మీడియా ముందుకొచ్చి తన వంతుగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేశాడు తమన్. వీర సింహా రెడ్డి విషయంలో అదే రిపీట్ చేసే ఛాన్స్ ఉంది.
This post was last modified on January 10, 2023 10:18 pm
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…