ప్రముఖ నిర్మాత సురేష్ బాబు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో రద్దీగా మారిపోయి ట్రాఫిక్ జామ్ కు దారి తీసిన వాహనాలకు దిశా నిర్దేశనం చేస్తూ కాసేపు సిటిజెన్ పోలీస్ అవతారం ఎత్తడం అందరి చేతా ప్రశంసలు పొందుతోంది. ఎవరికి వారు నాకేం పట్టిందని ఊరుకో బట్టి చాలా చోట్ల సగటు నగర వాసి జీవితం రోడ్ల మీదే ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది. తన స్థాయిని వయసుని పక్కనపెట్టి మరీ సురేష్ బాబు ఈ చొరవ తీసుకోవడం ఎంతైనా అభినందనీయం. ఇది మరికొందరికి స్ఫూర్తినిచ్చి స్వయంగా బాధ్యత తీసుకునేలా చేయగలిగితే ఎందరికో మేలు కలుగుతుంది. ఆయన ఉద్దేశం కూడా అదే.
ఇదే తరహాలో ఇండస్ట్రీలో ఏర్పడ్డ ట్రాఫిక్ ని క్లియర్ చేసే పెద్దరికం ఇప్పుడు పరిశ్రమకు చాలా అవసరం. ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో వ్యవహరిస్తుండటంతో ఏకాభిప్రాయాలు రాక పరిస్థితులు రాను రాను చేయి దాటి పోతున్నాయి. సంక్రాంతి థియేటర్ల విషయంలో ఎంత రచ్చ జరుగుతోందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రొడ్యూసర్ కౌన్సిల్ మౌనంగా ఉండటం తప్ప ఏమీ చేయలేని దైన్యంలో ఉంది. ఒకేసారి ఆరేడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద క్లాష్ అవుతున్నా ఇలా వద్దని చెప్పే పద్ధతి లేకుండా పోయింది. విడుదల వాయిదాలు, విపరీతంగా అదుపు తప్పుతున్న బడ్జెట్ భారాలు ఇవన్నీ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.
పైగా ఆ మధ్య నిర్మాతలందరూ షూటింగులు ఆపేసి మరీ సమస్యల పరిష్కారం కోసం చేసిన ధర్నా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. తక్కువ గ్యాప్ లోనే ఓటిటిలో కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. తారలు పారితోషికాలు తగ్గించుకునే ఆలోచన చేయడం లేదు. స్పాట్లో కంట్రోల్ లేకుండా పోతున్న ఖర్చుని నియంత్రించడానికి అవసరమైన నిబంధనలు పాటించే సూచనలు లేవు. ఇవన్నీ నామమాత్రపు చర్చలుగా మిగిలిపోయి కథను మళ్ళీ మొదటికే తెస్తున్నాయి. ఈ ట్రాఫిక్ ని సరిదిద్దే వ్యవస్థ టాలీవుడ్ కు రావాలి. మాటల్లో చెప్పినంత సులభం కాదు కానీ చొరవ తీసుకుంటే సాధ్యమేనని పైన ఉదాహరణ ఋజువు చేసిందిగా.
This post was last modified on January 3, 2023 10:51 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్‌లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…