Movie News

వారసుడు.. నెగెటివిటీని తట్టుకోగలదా?

వారసుడు.. సంక్రాంతి రాబోతున్న కొత్త చిత్రం. బేసిగ్గా తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ భారీ స్థాయిలోనే విడుదలవుతోంది. మామూలుగా అయితే తమిళ అనువాదాలు సంక్రాంతికి నామమాత్రంగా రిలీజవుతుంటాయి. రజినీకాంత్, సూర్య లాంటి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలకు కూడా ఆ టైంలో ఇక్కడ కష్టమే. కానీ విజయ్‌కి ఇక్కడ సరైన ఫాలోయింగ్ లేకపోయినా.. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కడం వల్ల డబ్బింగ్ వెర్ష‌న్‌ను పెద్ద ఎత్తున విడుదల చేయగలుగుతున్నారు.

ఈ విఫయంలో దిల్ రాజు ఎంత వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కొంటున్నారో తెలిసిందే. ఈ సినిమా ఫలితం అటు ఇటు అయితే దిల్ రాజు సోషల్ మీడియాకు మామూలుగా టార్గెట్ అవ్వడు. ఈ సినిమాకా ఆయన ఇంత ప్రయారిటీ ఇచ్చాడు.. అన్ని థియేటర్లు ఇచ్చుకున్నాడు.. వంద కోట్ల పారితోషకం ఇచ్చి, భారీ బడ్జెట్ పెట్టి తీసిన సినిమా ఇదా అంటూ ఆయన్ని గట్టిగా టార్గెట్ చేయడం ఖాయం.

థియేటర్ల గొడవ పుణ్యమా అని ‘వారసుడు’ సినిమా మీద ఎక్కడ లేని ఫోకస్ ఏర్పడింది. సినిమా చూడాలన్న కుతూహలం కంటే.. ఆ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఆత్రుత అందరిలోనూ వ్యక్తమైంది. చిరు, బాలయ్యల సినిమాలకు థియేటర్లు తక్కువ ఇచ్చి ‘వారసుడు’కు ఎక్కువ కేటాయిస్తున్నారు.. మంచి మంచి స్క్రీన్లు దానికి ఇచ్చేస్తున్నారు అన్న వార్తల్ని ఆ హీరోల అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో మొత్తంగా మెగా, నందమూరి అభిమానులు దిల్ రాజు సినిమా మీద కక్షగట్టేసే పరిస్థితి వచ్చింది.

దిల్ రాజు ఎంత సమర్థించుకున్నా సరే.. ఆయన వాదన ఎవరికీ కరెక్ట్ అనిపించడం లేదు. ఆయన తెలుగు సినిమాలకు అన్యాయం చేస్తున్నారనే భావన బలంగా జనాల్లోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ‘వారసుడు’ రిలీజ్ టైంలో సోషల్ మీడియా జనాలు ఆ సినిమా పని పట్టేందుకు చూస్తారనడంలో సందేహం లేదు. సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే.. విపరీతమైన నెగెటివ్ ప్రచారం జరగడం.. ఈ సినిమా చూడొద్దని ట్రెండ్స్ జరగడం ఖాయం.మరి ఈ నెగెటివిటీని తట్టుకుని ‘వారసుడు’ ఎంతమాత్రం నిలబడుతుందో చూడాలి.

This post was last modified on January 3, 2023 10:49 pm

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

2 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

3 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

3 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

3 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

6 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

6 hours ago