మొత్తానికి కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతే నిజమని తేలింది. ‘రాధేశ్యామ్’ తర్వాత ప్రభాస్ నటించబోయే కొత్త చిత్రంలో దీపికా పదుకొనేనే కథానాయికగా ఖరారైంది. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది.
బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన దీపిక.. ‘బాహుబలి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన ప్రభాస్ పక్కన కథానాయిక అనగానే అందరిలోనూ ఎగ్జైట్మెంట్ కనిపిస్తోంది. ఈ అప్‌డేట్‌తో సినిమా స్థాయి ఇంకా పెరిగింది.
ఐతే ఈ చిత్రంతోనే దీపిక తెలుగులోకి అడుగు పెడుతోందని అంతా అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. ఆమె టాలీవుడ్ అరంగేట్రం ఎప్పుడో జరిగిపోయింది.
ఒకప్పటి స్టార్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ కోసం ఓ తెలుగు సినిమాకు పని చేసింది దీపిక. ఆయనకు దీపిక క్లోజ్. జయంత్ దర్శకత్వంలో ‘లవ్ ఫర్ ఎవర్’ అనే సినిమా తెరకెక్కగా.. అందులో దీపిక ఓ ఐటెం సాంగ్ చేసింది. దీనికి సంబంధించి స్టిల్స్ కూడా బయటికి వచ్చాయి. కానీ ఎందుకో ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు.
దీపిక తెలుగు పాటను చూసే అవకాశం ఎవరికీ దక్కలేదు. ఆ తర్వాత జయంత్ దర్శకత్వంలోనే తెరకెక్కిన ‘తీన్ మార్’ సినిమాలో ఓ పాటలో దీపికతో స్టెప్పులు వేయిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాలేదు. ఆ సంగతలా వదిలేస్తే ఇప్పుడు ప్రభాస్ లాంటి పెద్ద హీరో సరసన పాన్ ఇండియా మూవీ ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. దీపిక తన మాతృభాష అయిన కన్నడలో ఇప్పటికే నటించింది.
This post was last modified on July 20, 2020 7:16 am
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…
తెలంగాణలోని అదికార కాంగ్రెస్ లో తిరుగుబాటు బావుటా ఎగిరిందని, ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ…
ఒకప్పుడు అంటే పాతిక ముప్పై సంవత్సరాల క్రితం ప్రేక్షకులు పాటలు వినాలంటే ఆడియో క్యాసెట్లు ఎక్కువగా చెలామణిలో ఉండేవి. అంతకు…