మెగాస్టార్ Chiranjeeviని ఆయన వీరాభిమాని అయిన బాబీ డైరెక్ట్ చేసిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా చేసే అవకాశం దక్కినప్పటి నుంచి బాబీ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. సందర్భం వచ్చిన ప్రతిసారీ చిరు మీద తనది ఏ స్థాయి అభిమానమో చెబుతూనే వస్తున్నాడతను. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ టీం అంతా కలిసి పాల్గొన్న గ్రాండ్ ప్రెస్ మీట్లో బాబీ మరోసారి చిరుపై తన అభిమానాన్ని ప్రదర్శించాడు. ఈ సందర్భంగా అతను చెప్పిన ఒక ‘ఫొటో’ స్టోరీ అందరినీ ఆకట్టుకుంది. ఆ స్టోరీ సంగతులేంటో చూద్దాం పదండి.
తన అభిమాన కథానాయకుడైన చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ సినిమా బ్లాక్‌బస్టర్ అవడం తాను ఇండస్ట్రీలోకి రావడానికి బీజం వేసిందని.. ఆ సినిమా రిలీజ్ తర్వాత తాను హైదరాబాద్ వచ్చేశానని.. ఆ సినిమాకు కథ అందించిన చిన్నికృష్ణను కలిసి తాను ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న విషయాన్ని చెప్పానని బాబీ తెలిపాడు. తాను 20 రోజుల పాటు వదలకుండా ఆయన వెనక తిరగడంతో తన దగ్గర అసిస్టెంట్‌గా చేర్చుకున్నట్లు బాబీ వెల్లడించాడు.
కాగా అదే సమయంలో తాను చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో మిగతా అభిమానులతో కలిసి రక్తం ఇవ్వడానికి వెళ్లానని.. అప్పుడు తనతో పాటు ఉన్న 50 మంది అభిమానులతో చిరు ఫొటోలు దిగాడన్నారు. కాగా తాను ఒక రౌండ్ అయ్యాక రెండోసారి ఆయనతో ఫొటో కోసం వెళ్లానని.. ఐతే తాను మళ్లీ వచ్చానని గుర్తించిన చిరు తన వైపు కొంచెం కోపంగా చూస్తూ ఫొటో వైపు చూడమన్నారని.. అలా చిరుతో తాను తీయించుకున్న ఫొటోలో ఆయన చాలా కోపంగా కనిపిస్తారని బాబీ గుర్తు చేసుకున్నాడు. తాను అంతకుముందు చిరు నవ్వుతుండగా తీయించుకున్న ఫొటో మాత్రం మిస్సయిందని.. ఆయన కోపంగా ఉన్న ఫొటోనే మిగలడంతో ఈ కోపానికి కారణం ఏంటని తనను చాలామంది అడిగారని బాబీ చెప్పాడు.
కాగా తాను దర్శకుడయ్యాక Pawan kalyanతో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చేస్తుండగా.. చిరంజీవి సెట్స్‌కు వస్తే అప్పుడు పవన్ ప్రోత్సాహంతోనే చిరుతో ఫొటో దిగినట్లు వెల్లడించాడు. బాబీ ఇలా చెబుతుండగా.. చిరు అతడి దగ్గరికొచ్చి గట్టిగా పట్టుకుని నవ్వుతూ ఫొటోగ్రాఫర్లకు సైగ చేసి ఫొటో దిగడం, వెంటనే బాబీకి ఒక ముద్దు కూడా పెట్టడం విశేషం. ఆ తర్వాత బాబీ కొనసాగిస్తూ ఈ ఫొటోను తాను పదిలపరుచుకుంటానని చెప్పాడు.
This post was last modified on December 28, 2022 8:56 am
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…