మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ‘మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే’ పాట వచ్చినప్పుడు పాజిటివిటీ కంటే ఎక్కువ నెగటివ్ రెస్పాన్స్ కనిపించింది. సోషల్ మీడియా అభిమానులు అంతగా సంతృప్తి చెందలేదని ట్వీట్స్ చూస్తే అర్థమైపోయింది. గబ్బర్ సింగ్ రేంజ్ లో ఊహించుకోవడం, పవన్ స్టయిల్ నే పాటగా రాయించే ప్రయత్నంలో హరీష్ శంకర్ గీత రచయిత చంద్రబోస్ తో చేయించిన ప్రయోగాలు ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయాయి.
అందుకే ఫ్యాన్స్ కళ్ళు ‘కాలర్ ఎత్తరా’ పాట మీద ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సిగ్నేచర్ మాస్ స్టైల్ లో సాంగ్ ఉండగా దానికి పవన్ వేసిన స్టెప్పులు మంచి ఎనర్జీతో ఉన్నాయి. మరీ చిరంజీవి, రామ్ చరణ్ రేంజులో ఊహించుకోము కాబట్టి దానికి అనుగుణంగానే తనదైన బాడీ లాంగ్వేజ్ తో పవన్ అభిమానులను అలరించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం హుషారుగా ఉంది. ఎవరికీ తలవంచకుండా జీవితంలో ఎలా ఉండాలనే సింపుల్ మెసేజ్ అందులో పొందుపరిచారు.
ఇప్పుడు వదిలిన కాలర్ లాంటి కంటెంట్ మెయిన్ సినిమాలో ఉంటే చాలు ఉస్తాద్ భగత్ సింగ్ పాసైపోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నుంచి జనం ప్రయోగాలు, మెసేజులు ఆశించడం లేదు. హైందవ ధర్మాన్ని హైలైట్ చేయబోయి హరిహర వీరమల్లులో ఎంత పొరపాటు జరిగిందో అందరికీ తెలిసిందే. ఓజి మెప్పించినప్పటికీ బిసి సెంటర్ల నాన్ బాల్కనీ అభిమానులు ఇంకా మెరుగ్గా ఆశించారు. ఉస్తాద్ లో వాటిని సరైన పద్ధతిలో హరీష్ శంకర్ మిక్స్ చేసి ఉంటే చాలు. బ్లాక్ బస్టర్ ఖాయం.
కెరీర్ పరంగా కూడా పవన్ కు ఈ మూవీ సక్సెస్ చాలా కీలకం. ఎందుకంటే దీని తర్వాత చెప్పుకోదగ్గ గ్యాప్ వస్తుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఎప్పుడో ఇంకా క్లారిటీ లేదు. సో ఎలా చూసుకున్నా కనీసం ఏడెనిమిది నెలలు పవన్ స్క్రీన్ మీద కనిపించడం కష్టం. సో ఉస్తాద్ భగత్ సింగ్ ని ఒక పెద్ద సెలెబ్రేషన్ లా చూసుకోవాలని అభిమానులు ప్లాన్ చేసుకుంటున్నారు. వాళ్ళు కోరుకున్నట్టు ఉంటే చాలు వసూళ్ల మోత పక్కా.
This post was last modified on March 12, 2026 5:52 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…