50 రూపాయలకే షకీలా సినిమా!

శృంగార తార షకీలా నిర్మాతగా మారి లేడీస్ నాట్ అలౌడ్ అనే సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మొదలై మూడేళ్లవుతోంది. చిన్నసినిమాగానే మొదలెట్టినా కానీ వడ్డీ తడిసి మోపెడయింది. ఆ మధ్య విడుదలకు సన్నాహాలు చేసుకుంటూ వుంటే థియేటర్లు మూత పడ్డాయి.

వడ్డీలు కట్టక్కర్లేదని ప్రభుత్వం చెప్పినా కానీ ఫైనాన్సియర్లు వినడం లేదట. దీంతో సెన్సార్ తలనొప్పులు, థియేటర్ లో రిలీజ్ చేసే తంటాలు పెట్టుకోకుండా ఒక వెబ్సైట్ పెట్టి అందులో సినిమా స్ట్రీమింగ్ కు పెడుతోంది. దీనికి ధర కూడా రూ. 50 అని డిసైడ్ చేసింది.

ఇరవై నిమిషాల సాఫ్ట్ పోర్న్ సినిమాలు తీసి రెండొందలు వసూలు చేస్తున్న వర్మలా కాకుండా పూర్తి సినిమాకే రీజనబుల్ వెల నిర్ణయించింది. టైటిల్ లోనే మహిళలకు ప్రవేశం లేదని తేల్చేసిన షకీలా ఈ సినిమాను మహిళలు చూడొద్దని చెప్తోంది. దీన్ని బట్టి మసాలా ఎలా ఉంటుందనేది మీరే ఊహించుకోండి.