మహానటి కోసం కదిలి వెళ్లిన అలివేలు మంగ!

సీత ఫ్లాప్ అయిన తర్వాత తేజ కసిగా ఒక ప్రేమకథ రాస్తున్నాడు. ఇంతకుముందు తన సినిమాల్లో కుర్ర ప్రేమలు చూపించిన తేజ ఈసారి మెచ్యూర్డ్ జంట మధ్య ప్రేమ చూపించబోతున్నాడు. గోపీచంద్ కథానాయకుడిగా నటించే ఆ చిత్రానికి పేరు కూడా రిజిస్టర్ చేసేసాడు. అలివేలు మంగ వెంకట రమణ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టిన తేజ తన అలివేలు మంగను మాత్రం ఇంకా డిసైడ్ చేయలేదు.

కాజల్ అయితే తేజ సినిమాకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది కనుక ఆమె హీరోయిన్ అని మీడియాలో రాసారు. గోపీచంద్, కాజల్ కాంబినేషన్ కూడా ఫ్రెష్ కాబట్టి ఇది సెట్ అవుతుందని భావించారు. అయితే కాజల్ ఇప్పుడు అవుట్ డేటెడ్ అయిపోవడంతో కీర్తి సురేష్ కోసం తేజ ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం.

కథానాయిక పాత్ర బాగా బలమైనది కనుక కీర్తి ఖచ్చితంగా ఒప్పుకుంటుందని తేజ నమ్మకం. మహేష్ తో సర్కారు వారి పాట చేస్తున్న కీర్తి అంతగా ఫామ్ లో లేని గోపీచంద్ తో నటిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.