చిరంజీవికి బ్రేకేసిన బాలయ్య!

లాక్ డౌన్ టైంలో సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి, కొన్ని వారాల పాటు తన హాస్య చతురతతో అలరించిన చిరంజీవి ఈమధ్య బాగా తక్కువ ట్వీటుతున్నారు. యమోత్సాహం చూపించిన యముడికి మొగుడు ఎందుకు సైలెంట్ అయిపోయాడనేది ఫాన్స్ కి అర్థం కావడం లేదు.

చిరంజీవి ట్వీట్స్ చూసేందుకే ట్విట్టర్ అకౌంట్లు మొదలు పెట్టిన వాళ్ళు కూడా పలువురు ఉన్నారు. వాళ్లంతా ఇప్పుడు నిరుత్సాహపడుతున్నారు. కరోనా క్రైసిస్ చారిటీకి సంబంధించి, తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళుతూ తనను పిలవనందుకు బాలకృష్ణ ఓపెన్ గా చిరంజీవిని ఎటాక్ చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి అప్పట్నుంచీ ముభావంగానే ఉంటున్నారు.

ఒకటీ అరా సోషల్ అవేర్నెస్ కలిగించే వీడియోలు తప్ప చిరులో ట్వీటింగ్ మొదలుపెట్టినప్పటి ఉత్సాహం అయితే లేదు. సినిమా పరిశ్రమ గురించిన విషయాల్లోనూ చిరంజీవి మునుపటి చొరవ చూపించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.