Movie News

నారప్పా.. మ్యాజిక్ కష్టమప్పా

ఈ మధ్య పాత బ్లాక్‌బస్టర్లను, కల్ట్ మూవీస్‌ను రీరిలీజ్ చేయడం ట్రెండుగా మారింది. స్టార్ హీరోల అభిమానులు రీరిలీజ‌్‌లను ప్రతిష్టాత్మకంగా తీసుకుని హంగామా చేయడం.. రికార్డుల గురించి సోషల్ మీడియాలో గొడవలు పడడం కూడా జరుగుతోంది. ఐతే పోకిరి, జల్సా సినిమాల వరకు అంతా బాగానే నడిచినా.. ఆ తర్వాతి సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి. వీటిలో కూడా ఫేక్ రికార్డుల చర్చ మొదలై వ్యవహారం పక్కదారి పడుతున్నట్లు కనిపించింది.

ఇటీవల రెబల్, వర్షం, బాద్‌షా లాంటి చిత్రాలకు సరైన స్పందనే కనిపించలేదు. అయినా సరే ఇప్పుడు ఓ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆ చిత్రమే.. నారప్ప. ఈ నెల 13న విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజును పురస్కరించుకుని నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని థియేటర్లలోకి దించుతున్నారు. ఈ సినిమా వసూళ్లను ఛారిటీ కోసం ఉపయోగించనున్నారట.

ఐతే మిగతా రీ రిలీజ్‌లతో పోలిస్తే ‘నారప్ప’ పరిస్థితి భిన్నం. ఈ సినిమా ఇంతకుముందు థియేటర్లలో కాకుండా ఓటీటీ ద్వారా విడుదలైంది. అది కూడా ఏళ్ల ముందు కాదు. గత ఏడాదే ఇలా రిలీజ్ చేశారు. అమేజాన్ ప్రైమ్ లాంటి ఎక్కువ సబ్‌స్క్రిప్షన్లు ఉండే ఓటీటీలో కావడంతో జనం టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమాను చూశారు. వెంకీ కెరీర్లో చాలా ఏళ్ల ముందు వచ్చిన ఏదైనా కల్ట్ మూవీనో, బ్లాక్‌బస్టర్నో తీసుకొచ్చి రిలీజ్ చేసి ఉంటే దాన్ని నోస్టాల్జిక్‌గా ఫీలై చూసేవారేమో. పైగా వెంకీ అభిమానులు మిగతా స్టార్ హీరోల అభిమానుల్లాగా తమ కథానాయకుడి కోసం మ్యాడ్‌నెస్‌తో ఊగిపోయేవాళ్లు కాదు. వెంకీ కొత్త సినిమాల రిలీజ్ టైంలో కూడా అంత హడావుడి కనిపించదు. వస్తారు కామ్‌గా సినిమా చూసి వెళ్తారు. ఆయనకు ఫ్యామిలీ ఆడియన్స్‌లోనే ఫాలోయింగ్ ఎక్కువ. వాళ్లంతా ఇప్పుడు థియేటర్లలో ‘నారప్ప’ను చూడ్డానికి ఎగబడే పరిస్థితి లేదు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఏమంత ఆశాజనకంగా లేవు.

‘నారప్ప’ను అప్పట్లో థియేటర్లలో రిలీజ్ చేయలేదని ఫీలయ్యారని, అందుకే ఈ సినిమాను ఇప్పుడు ఇలా విడుదల చేస్తున్నామని సురేష్ బాబు అంటున్నారు. ఐతే అప్పుడు థియేటర్లు అందుబాటులో ఉన్నా సరే.. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీలో రిలీజ్ చేసినందుకు ఫీలయ్యారే తప్ప.. ఇప్పుడు వెంకీ ఫ్యాన్స్ ఈ సినిమాను థియేటర్లలో చూడాలని ఎగబడే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో 13న ‘నారప్ప’ థియేటర్లలో ఏమాత్రం సందడి ఉంటుందా అన్నది సందేహమే.

This post was last modified on December 11, 2022 9:44 pm

Share

Recent Posts

సెటైర్లు సీరియస్‌గా తీసుకోనవసరం లేదు

నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…

3 hours ago

డబ్బింగ్ సినిమాల రేట్ల పెంపు సబబేనా

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…

3 hours ago

మార్చాల్సింది జ్ఞానేష్‌నా.. వ్య‌వ‌స్థ‌నా?!

ఒక ఇంట్లో దొంగ ప‌డ్డాడు. న‌గ‌లు, నట్రా దోచుకున్నాడు. య‌జ‌మాని ... ఆ దొంగ‌ను గుర్తించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.…

4 hours ago

బుమ్రా, పాండ్యా లేకుంటే అంతేనా…

టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…

5 hours ago

గ్రీన్‌కార్డ్ షాక్… ఐటీ కంపెనీలు ఏమంటున్నాయి?

అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…

6 hours ago

తిరుమ‌ల కేంద్రంగా సాయిరెడ్డి విన్యాసాలు స‌క్సెస్ అయ్యేనా?

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కేంద్రంగా వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డి చేస్తున్న రాజ‌కీయాల‌పై ఆస‌క్తికర…

10 hours ago