జిగర్ తండ.. తమిళంలో వచ్చిన బెస్ట్ డ్రామా థ్రిల్లర్లలో ఒకటిగా దీన్ని చెప్పొచ్చు. ‘పిజ్జా’ లాంటి సెన్సేషనల్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌తో ‘జిగర్ తండ’తో మహా మహులను మెప్పించారు. తమిళంలో ఉన్న లెజెండరీ ఫిలిం మేకర్స్, యాక్టర్స్ ఈ సినిమా చూసి ఫిదా అయిపోయారు. అతను ఎంచుకున్న కథ.. అనుసరించిన స్క్రీన్ ప్లే.. తీర్చిదిద్దిన పాత్రలు కల్ట్ స్టేటస్ అందుకున్నాయి. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కూడా ఘనవిజయం దక్కింది.
తమిళ వెర్షన్‌ను ఇతర భాషల వాళ్లు కూడా చూసి ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఈ చిత్రం తెలుగులో ‘గద్దలకొండ గణేష్’గా.. హిందీలో ‘బచ్చన్ పాండే’గా రీమేక్ అయింది. ఆయా భాషల్లో మార్పులు చేర్పులు చేసి కొంచెం భిన్నంగా తీర్చిదిద్దగా.. ఒరిజినల్ చూసిన వాళ్లకు ఇవి చూస్తే అంత కిక్కు రాలేదు.
‘జిగర్ తండ’ సినిమాతో కార్తీక్ మీద అంచనాలు అమాంతం పెరిగిపోగా.. వాటిని అందుకునేలా తర్వాత ఏ సినిమా తీయలేకపోయాడు.ఇరైవి, పేట, జగమేతంత్రం, మహాన్.. ఇవేవీ కూడా ‘జిగర్ తండ’కు దరిదాపుల్లో నిలవలేకపోయాయి. ఐతే ఇప్పుడు కార్తీక్ ‘జిగర్ తండ’కు సీక్వెల్ అనౌన్స్ చేసి అందరిలోనూ ఎగ్జైట్మెంట్ పెంచాడు. ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ అనే టైటిల్ పెట్టి.. రెండు గన్నులతో డిఫరెంట్ ప్రి లుక్ పోస్టర్ రిలీజ్ చేశాడు కార్తీక్. దీనికి ఒక వైరైటీ టీజర్ కూడా రెడీ చేశాడు. అది కూడా రిలీజ్ కాబోతోంది. దాంతోనే ఇందులో నటించే లీడ్ ఆర్టిస్టుల వివరాలు వెల్లడించబోతున్నాడు.
‘జిగర్ తండ’లో హీరో, విలన్ పాత్రలు చేసిన సిద్దార్థ్, బాబీ సింహా ఇందులో భాగం అవుతారా లేదా అన్నది సస్పెన్సే. బాబీ సింహా ఆ సినిమాలో లైఫ్ టైం పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఆ పాత్ర ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే చాలా ప్రత్యేకంగా నిలిచిపోయేది అనడంలో సందేహం లేదు. ఆ పాత్రకు గాను అతను నేషనల్ అవార్డు కూడా తీసుకున్నాడు. ‘జిగర్ తండ-2’లో ప్రధాన పాత్రలు ఎలా ఉంటాయి.. వాటిని ఎవరు పోషిస్తారు అన్నది ఆసక్తికరం.
This post was last modified on December 11, 2022 5:21 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…