సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న వ్యక్తుల్లో రియా చక్రవర్తి ఒకరు. ఈ అమ్మాయి సుశాంత్ ప్రేయసి కావడం గమనార్హం. ఆమెను మరి కొన్ని నెలల్లో సుశాంత్ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతోనూ ఉన్నాడట. కానీ ఏం జరిగిందో ఏమో.. ఇప్పుడిలా అర్ధంతరంగా జీవితాన్ని ముగించాడు.
సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడటానికి రియా కూడా ఓ కారణం అంటూ ఆమెపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మొన్న సుశాంత్ చనిపోయి నెల రోజులు పూర్తయిన నేపథ్యంలో అతడితో సన్నిహితంగా ఉన్నప్పటి ఫొటోలు పెట్టి ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది రియా. ఐతే అందులో ఆమె బాధను పట్టించుకోకుండా సుశాంత్ మరణానికి కారణమై ఇప్పుడు డ్రామాలాడుతున్నావా అంటూ నెటిజన్లు ఆమెను తిట్టిపోశారు.
ఐతే రియా అవేమీ పట్టించుకోకుండా తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ట్యాగ్ చేస్తూ ఓ సంచలన ట్వీట్ వేసింది. తాను సుశాంత్ ప్రేయసినని చెబుతూ.. అతను చనిపోయి నెల రోజులు అవుతోందని.. ప్రభుత్వం మీద తనకు పూర్తి విశ్వాసం ఉందని.. సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడేంత ఒత్తిడికి గురి కావడానికి కారణాలేంటో తెలుసుకునేందుకు సీబీఐ విచారణ జరిపించాలని కోరింది రియా.
ఐతే రియా, మహేష్ భట్, మరికొందరు బాలీవుడ్ బడా బాబులే సుశాంత్ మృతికి కారణమని.. అలాంటిది రియానే సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ కోరడం హాస్పాస్పదమని.. అయినా సుశాంత్ చనిపోయిన నెల రోజుల తర్వాత తీరిగ్గా ఇప్పుడు సీబీఐ విచారణ కోరడం ఏంటని.. ఈ పని అతను చనిపోయిన వెంటనే ఎందుకు చేయలేదని రియాను ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మొత్తంగా రియా ఏం చేసినా తప్పే అన్నట్లుగా ఉంది వ్యవహారం.
This post was last modified on July 16, 2020 4:47 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…