బాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందచందాలు ఈషా రెబ్బా సొంతం. మొదట్లో మరీ ట్రెడిషనల్‌గా కనిపించేది కానీ.. తర్వాత గ్లామర్ రూట్లోకి వచ్చేసింది. ముంబయి భామలకు ఏమాత్రం తీసిపోని రీతిలో హాట్ హాట్ ఫొటో షూట్లు చేసి అందరి దృష్టినీ ఆకర్షించింది. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్‌కు తోడు.. నటనలోనూ ఆమెకు తిరుగులేదు. తెలుగు చాలా చక్కగా మాట్లాడగలదు. పాత్రను అర్థం చేసుకుని నటించే, డైలాగ్ చెప్పే నైపుణ్యాలున్నాయి. మొత్తంగా ఈషాకు స్టార్ హీరోయిన్ కాగల లక్షణాలు అన్నీ ఉన్నా.. సరైన బ్రేక్ రాక, పెద్ద అవకాశాలు లేక ఇబ్బంది పడుతూనే ఉంది. సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ చూస్తే ఓ రేంజ్‌లో ఉంటోంది. వాళ్లందరూ కూడా ఈషాకు బ్రేక్ ఇవ్వమని అడిగేవాళ్లే.
ఐతే పెద్ద సినిమాల్లో అవకాశం రాకపోయినా.. లెజెండరీ మెగాస్టార్ చిరంజీవి ఈషా ప్రతిభను గుర్తించారు. కరోనా వైరస్ నేపథ్యంలో జనాలకు అవగాహన కలిగించేందుకు ఓ వీడియో చేసిన ఆయన.. ఇందులో భాగస్వామ్యం కోసం ఈషాతో పాటు యువ కథానాయకుడు కార్తికేయను ఎంచుకున్నారు. వాళ్లిద్దరితో కలిసి చేసిన వీడియో ఇప్పుడు ట్విట్టర్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఈషా చాలా ఉత్సాహంగా కనిపించింది. కనీసం ఈ రకంగా అయినా చిరంజీవి లాంటి లెజెండ్‌తో కలిసి నటించినందుకు ఈషా చాలా ఆనందిస్తున్నట్లే ఉంది. ఆమె ఫ్యాన్స్ కూడా ఈ వీడియో చూసి ఖుషీ అవుతున్నారు. ఆమె ప్రతిభను గుర్తించి పెద్ద సినిమాల్లోనూ అవకాశం కల్పిస్తే బాగుంటుందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. ‘అరవింద సమేత’ లాంటి పెద్ద సినిమాలో నటించినా.. అందులో సైడ్ క్యారెక్టర్ కావడంతో ఆమెకంత గుర్తింపు రాలేదు.
This post was last modified on July 16, 2020 7:14 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…