Movie News

“ప్రేమదేశం” డిసెంబర్ 9న మళ్లీ థియేటర్స్ లో !!!

ప్రేమదేశం చిత్రం అందరికీ గుర్తు ఉండే ఉంటది. అప్పట్లో ఆ చిత్రంలోని పాటలు, కథ కథనాలు ప్రేక్షకులని అంతలా ఆకట్టుకున్నాయి. ఇందులో స్నేహానికి ప్రాముఖ్యతనిస్తూ ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు ఖతిర్‌.

టబు, వినీత్‌, అబ్బాస్ నటించిన ప్రేమదేశం సినిమాలో ఎక్కడా వల్గారిటీ అనేది లేకుండా చాలా నీట్‌గా చిత్రాన్ని తీశారు. ఈ సినిమా కోసం రెహమాన్ అందించిన సంగీతం ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి.

ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ప్రేమదేశం మళ్లీ థియేటర్స్ లో సందడి చేయబోతోంది. డిసెంబర్ 9న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల కాబోతోంది. శ్రీ మాతా క్రియేషన్స్ బ్యానర్ పై రఘురాం రెడ్డి, రవికాంత్ రెడ్డి, నాగరాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

ప్రేమదేశం సినిమా స్పెషల్ షో హైదరాబాద్ లో వేశారు, నటి దివి, నటి శ్రేయ ప్రియ, అర్జున్ కళ్యాణ్ ఈ స్పెషల్ షో కు హాజరయ్యారు. అలాగే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన నిర్మాత కెటి.కుంజుమొన్ హాజరయ్యి ప్రేమదేశం సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

This post was last modified on December 6, 2022 4:39 pm

Share
Show comments
Published by
Satya
Tags: Prema Desam

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago