రవితేజ Vs నాని …హిట్టెవరికి ?

ఈ వారం ఇద్దరు స్టార్ హీరోలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నిర్మాతలుగా పోటీ పడుతున్నారు. అందులో ఒకరు రవితేజ కాగా మరొకరు నాని. రవితేజ సమర్పణలో RT టీం వర్క్స్ బేనర్ పై విష్ణు విశాల్ నటించిన ‘మట్టి కుస్తీ’ రేపే థియేటర్స్ లోకి డబ్బింగ్ సినిమాగా వస్తోంది. ఇక నాని ప్రెజెంట్స్ లో తెరకెక్కిన ‘హిట్ 2’ కూడా రేపటి నుండి థియేటర్స్ లో ఆడనుంది. నిజానికి ఈ ఇద్దరికీ ఈ రెండు సినిమాల సక్సెస్ కీలకం. ఈ ప్రాజెక్ట్స్ పై ఇద్దరూ చాలా నమ్మకం పెట్టుకున్నారు.

ఇక రవితేజ ప్రెజెంట్ చేస్తున్న మట్టి కుస్తీ ని డబ్బింగ్ సినిమా అని లైట్ తీసుకోలేం. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కోసం విష్ణు విశాల్ చాలా కష్టపడ్డాడు. పైగా విష్ణు సెలెక్ట్ చేసుకున్న కథలో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ నచ్చే రవితేజ విష్ణు విశాల్ చేసిన సినిమాలను తెలుగులో రిలీజ్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు. నాని కూడా దర్శకుడు శైలేష్ ను నమ్మి నిర్మించిన రెండో సినిమా ఇది. ‘హిట్’ నిర్మాతగా నాని కి మంచి అభినందనలు అందించింది. ఆ సినిమాకు కలెక్షన్స్ కూడా డీసెంట్ గా వచ్చాయి. మరో సెకండ్ కేస్ అంటూ హిట్ సిరీస్ నుండి నాని ఇంకో సినిమా అందిస్తున్నాదంటే ఈ ప్రాజెక్ట్ పై నాని పెట్టుకున్న నమ్మకం తెలుస్తుంది.

నాని -శేష్ కాంబో లో వస్తున్న హిట్2 పై తెలుగులో మంచి అంచనాలున్నాయి. క్రైం థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. మరి ఈ వారం స్టార్ హీరోలు ఈ రెండు సినిమాలతో నిర్మాతలుగా ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.