లోకేష్ తో ప్రభాస్ అయ్యేపనేనా ?

Prabhas
Prabhas

సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు కొన్ని క్రేజీ కాంబినేషన్స్ క్రియేట్ చేస్తూ తిప్పుతుంటారు. తాజాగా ప్రభాస్ – లోకేష్ కనగ రాజ్ కాంబోను టాపిక్ లోకి తీసుకొచ్చారు రెబల్ ఫ్యాన్స్. లోకేష్ కనగారాజ్ తో ప్రభాస్ మూవీ ఆన్ కార్డ్స్ అంటూ సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు. అయితే క్రేజీ కాంబినేషన్ అయ్యేపనేనా ? అంటే కచ్చితంగా కాదనలేం కానీ ప్రస్తుతానికి మాత్రం ఇది ఫేక్ న్యూస్ అనే చెప్పాలి. ఎవరో ఒక అభిమాని వేసిన ట్వీట్ పట్టుకొని చాలా మంది ఈ కాంబోను న్యూస్ చేస్తున్నారు.

నిజానికి బాహుబలి , సాహో తర్వాత చాలా మంది దర్శకుల కన్ను ప్రభాస్ పై పడిన మాట వాస్తవమే. కానీ రీసెంట్ గా ప్రభాస్ ఎవ్వరినీ కలవలేదు. ఎనౌన్స్ చేసిన సినిమాలు కాకుండా ఎవ్వరికీ ఒకే చెప్పలేదని సమాచారం. ప్రస్తుతానికి చేస్తున్న ప్రాజెక్ట్స్ తర్వాతే ప్రభాస్ ఇంకో సినిమా గురించి ఆలోచించే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఆదిపురుష్ , సలార్, ప్రాజెక్ట్ కే, మారుతీ సినిమా , స్పిరిట్ ఇలా ప్రభాస్ లైనప్ లో కిక్కిరిసిపోయే లిస్టు ఉంది. ఇవన్నీ చేయడానికే ప్రభాస్ కి రెండు మూడేళ్ళు పడుతుంది. ఈ లోగ ఇంకో సినిమా అంటే ప్రభాస్ తో కాని పని. అసలే రెండు షిఫ్టులు చేస్తున్నాడట ప్రభాస్. ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మరి ఈ టైంలో లోకేష్ కనగరాజ్ సినిమా కనీసం ఫ్యాన్స్ అయినా ఆలోచించాలి. లోకేష్ కనగారాజ్ కి కోలీవుడ్ లో మంచి లైనప్ ఉంది. తెలుగులో రామ్ చరణ్ తో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. సో ప్రభాస్ -లోకేష్ కాంబో వార్త జస్ట్ ఫేక్ అంతే.