కొన్ని సినిమాలను ప్రేక్షకులు అంత తొందరగా మర్చిపోలేరు. గుండెల్ని పిండేసి ఏడిపించే సినిమాలను మర్చిపోవడం జరగని పని. తాజాగా ఓ సినిమా టీజర్ ప్రేక్షకులను మెప్పించి ఓటీటీలో సూపర్ హిట్ అనిపించుకున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీని గుర్తుచేస్తోంది. ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య జంటగా సాయి రాజేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన బేబీ కి సంబంధించి టీజర్ రిలీజైంది. ఒక ఈవెంట్ ఏర్పాటు చేసి స్టార్ డైరెక్టర్స్ చేత టీజర్ రిలీజ్ చేశారు.
టీజర్ బాగుందనే కాంప్లిమెంట్ అందుకుంటున్నప్పటికీ, కథలో మాత్రం కొత్తదనం ఏం లేదనిపిస్తోంది. ముఖ్యంగా ఈ మధ్యే ఇదే కథతో వచ్చిన ‘కలర్ ఫోటో’ ను ఈ టీజర్ గుర్తుచేసింది. సుహాస్ , చాందిని చౌదరి జంటగా వచ్చిన ‘కలర్ ఫోటో’ సినిమా ఓటీటీ ప్రేక్షకులను మెప్పించి ఆహకి అమాంతంగా సబ్ స్క్రిప్షన్స్ పెంచేసింది. పైగా ఇటివలే నేషనల్ అవార్డు కూడా దక్కింది. అందులో నల్లగా ఉండే ఓ పేద కుర్రాడు అందమైన డబ్బున్న అమ్మాయితో సాగించే ప్రేమాయణం మెజారిటీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది.
ఇప్పుడు బేబీ కూడా ఇంచుమించు అదే కథతో వస్తుందా ? అనే అనుమానం ప్రేక్షకుల్లో కలుగుతుంది. పైగా రెండిటికి సాయి రాజేష్ రైటర్ కావడంతో ఈ పోలికకు ఎక్కువ స్కోప్ దొరింది. కలర్ ఫోటోలో హీరో నల్లగా ఉంటే, బేబీ లో హీరోయిన్ నల్లగా కనిపిస్తుంది. పైగా బేబీ క్లైమాక్స్ కూడా సాడ్ ఎండింగ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. మరి ఇవన్నీ చూస్తే మళ్ళీ అదే ఫోటోను తిప్పి చూపించనున్నారా ? అనే సందేహం వస్తుంది. ఏదేమైనా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకులే ఈ కథకి మార్కులేస్తారు కాబట్టి అంత వరకూ కలర్ ఫోటో నే అచ్చం దింపేశారని చెప్పలేం.
This post was last modified on November 22, 2022 10:14 pm
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
రీఎంట్రీ తర్వాత వరుసగా మూడు రీమేక్లతో పలకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో రెండు…
మన శంకరవరప్రసాద్ గారు నుంచి మరో పాట వచ్చేసింది. నిజానికీ రిలీజ్ రేపు జరగాలి. కానీ ఒక రోజు ముందుగా…
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్…
నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘అఖండ-2’ అనూహ్య పరిణామాల మధ్య వాయిదా పడిపోయిన సంగతి తెలిసిందే. ఒక రోజు ఆలస్యంగా…
గోవా ట్రిప్ అంటే ఫుల్ ఎంజాయ్ అనుకుంటాం. కానీ ఆరపోరాలోని 'బర్చ్ బై రోమియో లేన్' అనే నైట్ క్లబ్…