ఇంతన్నాడే అంతన్నాడే గంగరాజు, అయినాక ఒగ్గేసినాడే అంటూ పాత పాట ఒకటుంది. అంటే ఏదో బిల్డప్ ఇచ్చి చివరికి ఉసూరుమనిపించే వాళ్ళ గురించి ఉద్దేశించి దీన్ని పెద్దలు చెప్పారు. ఇప్పుడు ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ మీద ఇలాంటి కామెంట్లే వచ్చి పడుతున్నాయి. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో రూపొందుతున్న హనుమాన్ టీజర్ చూశాక ఇవి మరింత ఎక్కువయ్యాయి. పట్టుమని పది కోట్ల బడ్జెట్ లేని మీడియం సినిమాలో ఇంతేసి క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ ని పెట్టగలిగినప్పుడు అయిదు వందల కోట్లని బాకాలు ఊదుతున్న టి సిరీస్ ఇంకే రేంజ్ లో చూపించాలని నిలదీస్తున్నారు.
ఇలా అడగటంలో లాజిక్ ఉంది కానీ వాస్తవిక కోణంలో ఆలోచిస్తే ఆది పురుష్ లో ఉన్నది కేవలం విజువల్ ఎఫెక్ట్సో గ్రాఫిక్సో కాదు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఉపయోగించిన కష్టమైన సాంకేతికత. దీన్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోవడం వల్లే రజనీకాంత్ విక్రమ సింహ ఘోరంగా దెబ్బ తీసింది. అవతార్ ప్రపంచవ్యాప్తంగా నీరాజనాలు అందుకుంది కూడా ఈ టెక్నాలజీ వల్లే. మరి ప్రశాంత్ వర్మ లాంటి అప్ కమింగ్ టాలెంట్, కొత్త నిర్మాణ సంస్థతోనే ఇంత అవుట్ ఫుట్ ఇవ్వగలిగినప్పుడు టి సిరీస్ లాంటి దిగ్గజాన్ని చేతిలో పెట్టుకుని ఇలా చేస్తావా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ గట్టిగా ఆడుతున్నారు.
వీటికి ఓం రౌత్ స్పందిస్తాడనే గ్యారంటీ లేదు. విడుదల తేదీ వాయిదా పడ్డాక ఇతను సైలెంట్ అయిపోయాడు. పోస్ట్ ప్రొడక్షన్ మరో వంద కోట్లు అదనపు ఖర్చుతో సరిచేస్తున్నారని, టీజర్ కు వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని సీరియస్ గా తీసుకుని చాలా మార్పులు చేస్తున్నారని టాక్ ఉంది కానీ అవెంత వరకు నిజమో ట్రైలర్ వచ్చాక క్లారిటీ వస్తుంది. ఏది ఏమైనా కార్తికేయ 2, హనుమాన్, బింబిసార లాంటి చోటా మోటా మూవీసే ఇన్ని అద్భుతాలు చేయగలిగినప్పుడు ఆది పురుష్ ఇంకెంత చేయాలో అని అంచనాలు పెట్టుకోవడం తప్పేం కాదుగా. అయినా అయిదు వందల కోట్లని ఊదరగొట్టడం కాదు దాన్ని నమ్మేలా చూపించాలి మరి.
This post was last modified on November 21, 2022 10:44 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…